Site icon HashtagU Telugu

Pawan Delhi Tour: ఢిల్లీలో పవన్ బ్రేక్‌ఫాస్ట్‌ రాజకీయాలు

Pawan Kalyan

New Web Story Copy 2023 07 19t212132.497

Pawan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ మిత్రపక్ష సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. అయితే ఇది కేవలం బీజేపీతో దోస్తీ కొనసాగింపు మాత్రమే కాదు మధ్యలో టీడీపీ ప్రస్తావన తీసుకొస్తున్నారు పవన్. ఇప్పటికే లీకులు ఇచ్చారు. బీజేపీతో పొత్తు అంటూనే టీడీపీ త్వరలో జాయిన్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు.

ఈ రోజు ఉదయం పవన్ ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధరన్ తో భేటీ అయ్యారు. వీరిద్దరూ 20 నిమిషాల పాటు బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూ ఏపీ రాజకీయాల పరిస్థితిపై చర్చించారు. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పవన్ మురళీధరన్ తో ఓపెన్ అయినట్టు సమాచారం. జనసేన, బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకోనున్నట్టు పవన్ చెప్పారట. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. జనసేన, బీజేపీ, టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్టు పవన్ అమిత్ షాకు చెప్పారట.

వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కాకూడదనే లక్ష్యంతో పవన్ రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీని వదలడం లేదు. మరోవైపు బీజేపీ మిత్రపక్ష సమావేశానికి టీడీపీకి ఆహ్వానమే అందలేదు. అయితే ఇదొక రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు ఎనలిస్టులు. ఏదైమైనా వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసే ఎలక్షన్ బరిలో దిగనున్నాయి. ఇక సీఎం జగన్ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

Read More: Snake: పాములు గర్భవతులను కాటు వేయవా.. ఇందులో నిజమెంత?