Site icon HashtagU Telugu

Pawan : ఇదే కదా మీము కోరుకుంటుంది..పవన్ నిర్ణయాలకు ప్రజలు ఫిదా..!!

Pawan

Pawan

పదేళ్లుగా ప్రజల్లో తిరుగుతూ.వారి కష్టాలను తెలుసుకుంటూ..వారు ఇంకోరుకుంటున్నారో..? వారికీ ఏంకావాలో..? వారికీ ఏమిస్తే సంతృప్తి చెందుతారో..? ఎలాంటి మార్పులు తీసుకొస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందో..? ఇవన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్..ఇప్పుడు అవన్నీ చేసేందుకు పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తూ అందరికి ఆదర్శం అవుతున్నారు. ఉపముఖ్యమంత్రి తో పాటు పలుశాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి కూడా పవన్ బిజీ బిజీ గా ఉన్నారు. ఓ పక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే..మరోపక్క వాటిని తీర్చేందుకు అధికారులతో మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యపేతమగు ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తు వాటిని ఎలా పరిష్కరించాలో తెలియజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో (Employees) సమావేశం (Meeting) అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ… వాటిని నోట్ చేసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పని చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో నాశనం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పని చేద్దామని సూచించారు. ఉద్యోగులను చిన్నచూపు చూడనని.. వారిని తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు.

సమస్యలను చెప్పడమే కాదు… ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం సూచించాలని ఉద్యోగులతో అన్నారు. భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దామని పిలుపిచ్చారు. దీనికి తాను కంకణబద్ధుడినై పని చేస్తానన్నారు. తన ఒక్కడి వల్లనే ఈ మహా క్రతువు పూర్తి కాదని, ఉద్యోగుల సహకారం, సూచనలు చాలా అవసరమని.. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అలాగే నిన్న జనసేన నేతలతో సమావేశమైన ఆయన..సభల్లో కానీ ఇతర మరే వేదికలపై కానీ పరుష పదజాలం వాడొద్దని పార్టీ నాయకులకు బలంగా సూచించారు. భావంలో తీవ్రత‌ వుండాలి కానీ మాటల్లో కాదని, ప్రతి ఒక్కరూ ప్రజల పట్ల వినయపూర్వకంగా వుండాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే దిశగానే అడుగులు వుండాలని దిశానిర్దేశం చేసారు. ఇలా చెప్పడమే కాదు.. పవన్ ఆచరించి చూపించారు కూడా. గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క వ్యంగ వాఖ్యానం కానీ, కఠినమైన ప‌దం గానీ ఆయ‌న నోటి నుంచి రాలేదు. చాలా హుందాగా మాట్లాడుతున్నారు పవన్. మొత్తానికి భాధ్య‌త‌లు చేపట్టిన తక్షణమే శరవేగంగా ముందుకు కదులుతున్నారు. అధికారంలో వున్న ప్రతి రోజు అమూల్యమని గతంలో చెప్పిన తన అధికారంతో ప్రజలు ఎంతో మేలు చేయొచ్చనే అంశంపైన ఒక ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు ఆయన కార్యచరణ చూస్తుంటే అర్ధమౌతోంది.

Read Also : Head Replaces Suryakumar: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు బిగ్ షాక్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ట్రావిస్ హెడ్‌..!