Site icon HashtagU Telugu

Pawan Kalyan:21న నరసాపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

అమరావతి: నవంబర్ 21వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో సమావేశం జరగనుంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జరిగే ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో నరసాపురం వేదికగా జరగనున్న బహిరంగ సభలో రాష్ట్రంలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావించే అవకాశం ఉందని తెలియజేశారు. ఇప్పటికే పలు కీలక సమస్యలను జనసేన పార్టీ శ్రేణులు పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపై పవన్ కళ్యాణ్ చర్చించి తన ప్రసంగంలో ప్రస్తావించి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

గతంలో శ్రీకాకుళం జిల్లా కపాసుకుర్ది ఒడ్డున గంగానదికి పూజలు చేసి మత్స్యకారుల అభివృద్ధిని కాంక్షిస్తూ పోరాట యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.