Site icon HashtagU Telugu

PK Ippatam Tour: `మ‌నల్ని ఎవ‌డ్రా ఆపేది..` వీడియో హ‌ల్ చ‌ల్‌

pawan kalyan

pawan kalyan

జ‌న‌సేనాని ప‌వ‌న్ గుంటూరు జిల్లా `ఇప్ప‌టం` రాజ‌కీయ సినిమా సూప‌ర్ హిట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. వేగంగా వెళుతోన్న కారు టాప్ పై కాళ్ల‌ను రిలాక్స్ పెట్టి కూర్చొని ప్ర‌యాణిస్తోన్న ప‌వ‌న్ వీడియో వైర‌ల్ అవుతోంది.

కారు టాప్ పై పవన్ కు రక్షణగా ఆయన అభిమానులు ఇరువైపులా నిలబడి ముందుకు సాగారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పవన్ ఫ్యాన్స్ ”మనల్ని ఎవడ్రా ఆపేది” అనే ఓ కామెంట్ ను దానికి జత చేశారు. మరో వ్యక్తి ఇదే వీడియోను షేర్ చేస్తూ ”ఆ ఆటిట్యూడ్ చూడు తమ్ముడు” అని వ్యాఖ్యానించాడు. ఇంకో వ్య‌క్తి ”ఇదేం ఆటిట్యూడ్ అన్నా” అంటూ సెటైర్ సంధించాడు.

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లిన‌ జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్థులు భూములు ఇచ్చారన్న ఆగ్రహంతో వైసీపీ సర్కారు గ్రామంలో రోడ్ల వెడల్పు పేరిట ఇళ్లను కూల్చివేసిందని పవ‌న్ ఆరోప‌ణ‌. బాధితులను పరామర్శించేందుకు శనివారం ఇప్పటంలో పర్యటించారు. శుక్రవారం రాత్రికే విజయవాడ చేరుకున్న జ‌న‌సేనాని శ‌నివారం మధ్యాహ్నం ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వ‌ద్ద బ‌య‌లుదేరిన ప‌వ‌న్ ఇప్పటం గ్రామం చేరుకోకముందే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. అనంతరం కారు టాప్ పై అలా కాళ్లు బారజాపుకుని రిలాక్డ్స్ డ్ గా కూర్చున్నారు. వేగంగా దూసుకుపోతున్నా చలించని పవన్ కారుపై రిలాక్స్ డ్ గా కూర్చోవ‌డం హైలెట్ సీన్.

 

Exit mobile version