Site icon HashtagU Telugu

Pawan Kalyan : 2029లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తాం..పవన్ వార్నింగ్

Pawan Markapuram

Pawan Markapuram

మార్కాపురంలో రూ. 1290 కోట్ల విలువైన త్రాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ సందర్భంగా వైసీపీపై కుండబద్ధలు కొట్టారు. “2029లో అధికారంలోకి వచ్చి మీ అంతు చూస్తామని” వైసీపీ నేతలు చెబుతున్నారని, ముందుగా వారు అధికారంలోకి రావాలంటూ వ్యంగ్యంగా స్పందించారు. తాము ప్రజల మద్దతుతో గెలిచి అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. రాజకీయాల్లో రౌడీల గర్జనలకు భయపడితే ఏదీ సాధ్యం కాదన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నిర్లక్ష్యం గురయ్యిందన్న యువత అభిప్రాయాన్ని ప్రస్తావిస్తూ, తనకు దీని గురించి ఎంతో బాధనని పేర్కొన్నారు.

Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటికి షాక్

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యను తాను సంవత్సరాలుగా చూసినట్టు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాకపోవడాన్ని వైసీపీ పాలన వైఫల్యంగా అభివర్ణించారు. “వైసీపీ రూ. 4 వేల కోట్లు అప్పు తీసుకుని కూడా తాగునీటి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారు. ప్రజల దాహం తీర్చలేకపోయారు. పాలన బాగుంటే వైసీపీ 11 సీట్లకు పరిమితం కాకుండే ఉండేది” అంటూ విమర్శించారు. ఫ్లోరైడ్ సమస్యతో తానే స్వయంగా కరిగిపోయిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, మల్టీ విలేజ్ ప్రాజెక్టుకు మొదట ప్రాధాన్యత ప్రకాశం జిల్లానే కాదన్నారు.

KTR : పాశమైలారం విషాదంపై కేటీఆర్ మండిపాటు..మరణాలను ఫొటోషూట్‌గా చూస్తున్న సీఎం రేవంత్

తాజాగా ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు స్వాతంత్య్రం తర్వాత ప్రకాశంలో చేపట్టిన అతిపెద్ద తాగునీటి ప్రణాళిక అని పవన్ వెల్లడించారు. మొదటి విడతలో 1390 కోట్లతో 18 మండలాలు, 572 గ్రామాల్లో 10 లక్షల మందికి తాగునీరు అందించబోతున్నట్లు హామీ ఇచ్చారు. 31 ఓవర్ హెడ్ రిజర్వాయర్లు, పైపులైన్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. “కూటమిలో ఎవరు ఎక్కువ కాదుగానీ, ఎవరు తక్కువ కాబోదు – అందరూ సమాన బాధ్యతతో పనిచేస్తున్నారు” అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.