Modi, Pawan Meet: జ‌గ‌న్ కోసం రోడ్ మ్యాప్‌..?

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో జ‌న‌సేనాని ప‌వ‌న్ భేటీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతుందా? రాజ‌కీయ రోడ్ మ్యాప్ పై క్లారిటీ రానుందా? వాళ్లిద్ద‌రి భేటీ తెలుగుదేశం పార్టీని ఒంట‌రి చేయ‌నుందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. టైమ్ ఫిక్స్ కాన‌ప్ప‌టికీ భేటీ మాత్రం ఉంటుంద‌ని జ‌న‌సైన్యం విశ్వ‌సిస్తోంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ రాత్రికి మోడీ విశాఖ చేరుకుంటారు. ఆ త‌రువాత ఏపీ బీజేపీ నేత‌ల‌తో స‌మావేశం అవుతారు. అది ముగిసిన త‌రువాత ప‌వ‌న్ కు టైమ్ ఇచ్చే అవ‌కాశం ఉంది.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 01:02 PM IST

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో జ‌న‌సేనాని ప‌వ‌న్ భేటీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతుందా? రాజ‌కీయ రోడ్ మ్యాప్ పై క్లారిటీ రానుందా? వాళ్లిద్ద‌రి భేటీ తెలుగుదేశం పార్టీని ఒంట‌రి చేయ‌నుందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. టైమ్ ఫిక్స్ కాన‌ప్ప‌టికీ భేటీ మాత్రం ఉంటుంద‌ని జ‌న‌సైన్యం విశ్వ‌సిస్తోంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ రాత్రికి మోడీ విశాఖ చేరుకుంటారు. ఆ త‌రువాత ఏపీ బీజేపీ నేత‌ల‌తో స‌మావేశం అవుతారు. అది ముగిసిన త‌రువాత ప‌వ‌న్ కు టైమ్ ఇచ్చే అవ‌కాశం ఉంది. లేదంటే మరుస‌టి రోజు(12న‌) ఏదో ఒక టైమ్ ఇస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక షెడ్యూల్ ప్ర‌కారం వాళ్ల భేటీ టైమ్ మాత్రం ఫిక్స్ కాలేదు.

సాధార‌ణంగా ప్ర‌ధాన మంత్రి హోదాలో ఎవ‌రు వ‌చ్చిన‌ప్ప‌టికీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌ను విప‌క్ష నేత‌లు ప్ర‌స్తావిస్తారు. ఇప్పుడు మోడీతో ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌, రైల్వే జోన్, అమ‌రావ‌తి రాజ‌ధాని అంశాల‌ను ప‌వ‌న్ ప్ర‌స్తావించాలి. ఒక వేళ వాటిని ప్ర‌స్తావించ‌కుండా భేటీ ముగిస్తే జ‌న‌సేనాని ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బ‌డే అవ‌కాశం ఉంది. ఎందుకంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ కార్మికులు ఆందోళ‌న చేస్తున్నారు. పైగా బంద్ కు కూడా పిలుపు ఇచ్చిన క్ర‌మంలో ఆ ఇష్యూ మీద భేటీ త‌రువాత ఏదో ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోతే ప‌వ‌న్ రాజ‌కీయంగా న‌ష్ట‌పోతారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన అంశాల కంటే రోడ్ మ్యాప్ కు ప్రాధాన్యం ఇస్తే జ‌న‌సేన ప్ర‌జ‌ల మ‌ధ్య చుల‌క‌న అయ్యే ఛాన్స్ లేక‌పోలేదు.

Also Read:  NTR Marg: ఫార్ములా వ‌న్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్‌. వివాదాస్ప‌ద‌మ‌వుతున్న నిర్ణ‌యం

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన అంశాల‌ను నివేదిక రూపంలో అందించేలా జ‌న‌సేన ప్లాన్ చేస్తోంద‌ట‌. ప్ర‌ధాని మోడీని క‌లిసిన వెంట‌నే విన‌త‌ప‌త్రాల‌ను మొక్కుబ‌డిగా ఇచ్చిన త‌రువాత రోడ్ మ్యాప్ మీద ఎక్కువ‌గా దృష్టి పెడ‌తార‌ని తెలుస్తోంది. బీజేపీతో క‌లిసి న‌డుస్తోన్న ప‌వ‌న్ టీడీపీని కూడా క‌లుపుకుని పోవాల‌ని త‌ల‌పోస్తున్నారు. కానీ, జ‌గ‌న్ తో బ‌ల‌మైన సంబంధాలు ఉన్న బీజేపీ మాత్రం అందుకు నిరాక‌రిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ఎదుర్కొంటుంద‌ని రాష్ట్ర నేత‌లు చెబుతున్నారు. బ‌హుశా అదే మోడీ ద్వారా రోడ్ మ్యాప్ ను ప‌వ‌న్ వింటార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. అప్పుడు రాష్ట్రంలో ముక్కోణ‌పు పోటీ జ‌ర‌గ‌డం ద్వారా తిరిగి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అవుతార‌ని అంచ‌నా. అదే, బీజేపీ ఢిల్లీ రోడ్ మ్యాప్ అనేది స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్లిన‌ప్ప‌టికీ తిరుప‌తి లోక్ స‌భ ఫ‌లితానికి మించి ఏమీ ఉండ‌ద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఒక వేళ మోడీ రోడ్ మ్యాప్ బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్లాల‌ని ఇస్తే, ప‌వ‌న్ మ‌రో విధంగా స్పందిస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్ప‌టికే జ‌న‌సేన ముందున్న ఆప్ష‌న్ల‌ను ప‌వ‌న్ ఆవిర్భావ స‌భ‌లో చెప్పేశారు. వాటిలో ఏదో ఒక‌దాన్ని ఎంచుకోవ‌డానికి మోడీ భేటీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

Also Read:  CM Jagan : ఐటీసీతో జ‌గ‌న్ `స్పైసీ ` అడుగు