Site icon HashtagU Telugu

Leg Injury : పవన్ కళ్యాణ్ కు గాయం చేసిన అభిమానులు

Pawan Leg Injurey

Pawan Leg Injurey

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు గాయం (Injury ) కావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళలన మొదలైంది. గత మూడు నెలలుగా పవన్ కళ్యాణ్ ఏమాత్రం రెస్ట్ లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. బిజెపి తో పొత్తు ఓకే చేయడం దగ్గరి నుండి ప్రచారం వరకు అన్ని తానై చూసుకుంటూ వస్తున్నాడు. ఓ పక్క తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తూనే..మరోపక్క జనసేన అభ్యర్థులు బరిలోకి దిగిన నియోజకవర్గాల్లో ప్రచారం..అలాగే కూటమి కీలక నేతల తరుపు ప్రచారం ఇలా క్షణం తీరిక లేకుండా నెల రోజులుగా పర్యటిస్తూనే ఉన్నాడు. ఓ పక్క జ్వరం బాధిస్తున్నప్పటికీ..జ్వరంతోనే చాల సభల్లో పాల్గొంటూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక నిన్న రాజమండ్రి లో జరిగిన ప్రజాగళం సభలో సైతం పాల్గొన్నారు. మోడీ ఫై ప్రశంసలు కురిపిస్తూనే..జగన్ ఫై విమర్శలు దాడి చేసారు. అయితే ఇప్పుడు ఓ వార్త జనసేన శ్రేణుల్లో , నేతల్లో ఆందోళనకు గురి చేస్తుంది. తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర సభ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్న తరువాత ..ఎయిర్ పోర్టులో అభిమానులకు సెల్ఫీలు ఇస్తున్న క్రమంలో పవన్ కుడి కాలి బొటనవేలికి గాయమైంది.

దీంతో ఆయన కాలికి చికిత్స చేసారు. ఆ గాయంతోనే ఆయన బయటకొచ్చారు. ఎన్నికలకు టైమ్ దగ్గర పడటంతో కాలికి కట్టుతోనే ప్రచార సభల్లో పవన్ పాల్గొంటున్నారు. తిరుపతిలో నిర్వహించిన సభలో చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కు గాయం కావడంతో జనసైనికులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

Read Also : Vote For Pawan : పవన్ గెలుపు కోసం ప్రచారంలోకి దిగిన అగ్ర నిర్మాత