Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఢిల్లీలో పవన్ కళ్యాణ్.. NDA మీటింగ్ పై కామెంట్స్.. ఏపీ ఎన్నికల గురించి ప్రస్తావన ఉంటుంది..

Pawan Kalyan Land in Delhi for NDA Meeting and comments on NDA Meeting

Pawan Kalyan Land in Delhi for NDA Meeting and comments on NDA Meeting

మంగళవారం (జులై 18న) ఢిల్లీ(Delhi) వేదికగా దాదాపు 30 పార్టీల మద్దతు కలిగిన ఎన్డీఏ(NDA) కూటమి భేటీ జరగబోతోంది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 30కి పైగా పార్టీ అధినేతలు హాజరవ్వనున్నారు.రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ అశోక హోటల్ లో ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. ఇప్పటికే పలువురు నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే ఏపీ బీజేపీ(BJP) అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నేడు ఉదయం పవన్ తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. సిఐ అంజు యాదవ్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం తిరుపతి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రేపటి NDA సమావేశం గురించి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల భవిష్యత్, పార్టీల మధ్య ఐక్యత, జనసేన పాత్రపై రేపటి ఎన్డీఎ సమావేశంలో చర్చ జరగవచ్చు. ఎన్డీఎ పాలసీలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే దానిపై చర్చ రేపటి సమావేశంలో జరగవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పొత్తులపై సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. ప్రధాని మోడీ, అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ ఏదీ లేదు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కలుస్తున్నాను అని తెలిపారు.

 

Also Read : Delhi Road Map : ఒకే వేదిక‌పై పురంధ‌రేశ్వ‌రి, ప‌వ‌న్.! NDA స‌మావేశం త‌రువాత‌..?