Site icon HashtagU Telugu

AP : పవన్ కళ్యాణ్ ను వదిలేది లేదు – బిజెపి క్లారిటీ

Modi Pawan Cbn

Modi Pawan Cbn

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – బిజెపి మైత్రి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రధాని మోడీ సైతం పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవిస్తారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులు సైతం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి..కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం ప్రధాని మోడీ ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు రెడీ గా ఉంటాడు. మోడీ చుట్టూ ఎంతమంది ఉన్న..పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యేక స్థానం కలిపిస్తుంటారు. దీనికి కారణం పవన్ నిజాయితే. 2014 నుండి బిజెపి తో పవన్ స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. మొన్నటి ఏపీ ఎన్నికల్లోనూ బిజెపి ..టీడీపీ తో చేతులు కలపడం వెనుక కూడా పవన్ కల్యాణే కారణం. ఈరోజు కూటమి ఎంత బలంగా ఏర్పడడానికి కూడా పవనే కారణం. అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చిన..ఎన్ని అపజయాలు వచ్చిన పవన్ కళ్యాణ్ ను వీడేది లేదని బిజెపి అంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలపై బిజెపి ఫుల్ ధీమాగా ఉంది. కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని భావిస్తుంది. అంతే కాదు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావటం ఖాయంగా కనిపిస్తోంది. కూటమికి అధికారం దక్కకపోతే పవన్ రాజకీయ భవిష్యత్ బాధ్యతలు బీజేపీ తీసుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో కూటమి అధికారం లోకి రాకపోతే..పవన్ ను కేంద్రంలో మోదీ కేబినెట్ లో సహాయ మంత్రిని చేయాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా విశ్వసనీయ సమాచారం. టీడీపీకి వచ్చే ఎంపీ సీట్ల ఆధారంగా వారికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఉంటుందా…లేదా అనేది నిర్ణయం కానుందని చెబుతున్నారు.

ఏపీలో బిజెపి భవిష్యత్ లో ఎదగాలంటే పవన్ మద్దతు అవసరమని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ రాష్ట్రానికి పరిమితం కానున్నారు. కూటమికి అధికారం దక్కకుంటే మాత్రం పవన్ తో కలిసి ఏపీలో బలోపేతం కావాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదన పైన పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది. అయితే, ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాతనే ఈ ప్రతిపాదనల పైన పవన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Read ALso :