Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదు… ప్రజా స్టార్ – వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 02:24 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్యాకేజీ స్టార్ (Package Star) కాదు..ప్రజాస్టార్ (Praja Star) అన్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama). సీఎం జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ , దత్తపుత్రుడు , మ్యారేజ్ స్టార్ అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి అంటూ లేక, ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక… సలహాదారులు రాసిచ్చే స్క్రిప్టును జగన్ చదివి వినిపిస్తారని, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పెళ్లిళ్లకు, రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఏమైనా సంబంధం ఉందా..? అని జగన్ ను సూటిగా రఘురామ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి లేకుండా అవే మాటలు మాట్లాడుతుండడం చూస్తే విడ్డూరంగా ఉందని..జగన్ ఇలా పదే పదే అంటుంటే ప్రజలు నవ్వుతున్నారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్యాకేజీ స్టారే అయితే, ఎవరినైనా కొనుగోలు చేసే స్తోమత జగన్ మోహన్ రెడ్డి గారికే ఉందని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కొనలేరని, ఎవరు కొనలేని వ్యక్తిత్వం ఆయన సొంతం అని అన్నారు. రాష్ట్రంలో జగన్ దోచుకున్న సొమ్ములో అర శాతం అయినా పెద్ద మొత్తమే అవుతుందని, ఎంతోమందిని డబ్బులతో మేనేజ్ చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయారని అన్నారు.

Read Also : Lok Sabha Elections: ముందస్తు ఎన్నికలకు మోడీ సై, జగన్, రేవంత్ అలర్ట్!