Site icon HashtagU Telugu

NTR Trust Euphoria Musical Night : బాలకృష్ణ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Balayya

Pawan Balayya

తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ (NTR Trust Euphoria Musical Night) అట్టహాసంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28 ఏళ్లుగా ప్రజాసేవలో అంకితభావంతో కొనసాగుతుండగా, ఈ ప్రత్యేక కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తలసేమియా బాధితులకు సాయంగా ఈ వేడుక ద్వారా వచ్చిన విరాళాలను ఉపయోగిస్తామని ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బాలకృష్ణ (Balakrishna) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆయన నన్ను ప్రేమగా బాలయ్య అని పిలవమంటారు. కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. అందుకే నేను ఆయనను ‘సర్’ అని పిలవాలని అనుకుంటా. ఆయన ఎవ్వరినీ లెక్కచేయని ధైర్యవంతుడు, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎదురు నిలిచే ఎవరినైనా ఎదుర్కొనే బలమైన వ్యక్తిత్వం కలవాడు. ఆయన నటన కాలం ఎంత మారినా ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. మా సోదరుడు బాలకృష్ణ గారు సినిమాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ అగ్రభాగాన ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం గర్వించదగ్గ విషయం. ఇకపై ఆయనను ‘పద్మభూషణ్ బాలకృష్ణ’ గారిగా గౌరవించాలి’ అంటూ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ అట్టహాసంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28 ఏళ్లుగా ప్రజాసేవలో అంకితభావంతో కొనసాగుతుండగా, ఈ ప్రత్యేక కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తలసేమియా బాధితులకు సాయంగా ఈ వేడుక ద్వారా వచ్చిన విరాళాలను ఉపయోగిస్తామని ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆయన నన్ను ప్రేమగా బాలయ్య అని పిలవమంటారు. కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. అందుకే నేను ఆయనను ‘సర్’ అని పిలవాలని అనుకుంటా. ఆయన ఎవ్వరినీ లెక్కచేయని ధైర్యవంతుడు, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎదురు నిలిచే ఎవరినైనా ఎదుర్కొనే బలమైన వ్యక్తిత్వం కలవాడు. ఆయన నటన కాలం ఎంత మారినా ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. మా సోదరుడు బాలకృష్ణ గారు సినిమాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ అగ్రభాగాన ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం గర్వించదగ్గ విషయం. ఇకపై ఆయనను ‘పద్మభూషణ్ బాలకృష్ణ’ గారిగా గౌరవించాలి,” అంటూ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి చేతికి చెక్ అందజేస్తానని తెలిపారు. ఆయన ప్రకటించిన ఈ విరాళంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, భువనేశ్వరి సహా సభలోని ప్రతీ ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మనసుపెట్టి చేసిన ఈ విరాళం ఎందరో రోగులకు వెలుగునిచ్చే అవకాశం కల్పిస్తుందని ట్రస్ట్ సభ్యులు అభిప్రాయపడ్డారు.