Viral : ఎంపీ బరిలో పవన్ కళ్యాణ్..? బీజేపీ ఆఫర్ కు ఓకే చెప్పాడా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు..ఎలా ఉంటారో..ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో..పక్కనవారికే కాదు ఎవరికీ తెలియదు..అప్పటికప్పుడు సడెన్ నిర్ణయం తీసుకుంటూ అందరికి షాక్ ఇస్తుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి (Politics) అడుగుపెట్టి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ఈసారి అడుగుపెట్టడమే కాదు సీఎం (CM) కుర్చీ లో కూడా కూర్చోబోతారని జనసేన శ్రేణులు(Janasena Ranks) ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ న్యూస్ అందర్నీ షాక్ లో పడేస్తుంది. నిన్నటి వరకు […]

Published By: HashtagU Telugu Desk
Pawan Loksabha

Pawan Loksabha

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు..ఎలా ఉంటారో..ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో..పక్కనవారికే కాదు ఎవరికీ తెలియదు..అప్పటికప్పుడు సడెన్ నిర్ణయం తీసుకుంటూ అందరికి షాక్ ఇస్తుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి (Politics) అడుగుపెట్టి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ఈసారి అడుగుపెట్టడమే కాదు సీఎం (CM) కుర్చీ లో కూడా కూర్చోబోతారని జనసేన శ్రేణులు(Janasena Ranks) ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ న్యూస్ అందర్నీ షాక్ లో పడేస్తుంది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే (Pawan MLA) గా పోటీ చేయబోతున్నారని..గాజువాక , తిరుపతి , కాకినాడ , భీమవరం ఇలా పలు నియోజకవర్గాల పేర్లు ప్రచారం అయ్యాయి. వీటిల్లో ఏదొక నియోజకవర్గం నుండి పోటీ చేయడం గ్యారెంటీ అని అంత ఫిక్స్ అయ్యారు.

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బరిలో కాదు పార్లమెంట్ బరిలో(LoK Sabha) పోటీ చేయబోతున్నాడనే వార్త జనసేన శ్రేణులను షాక్ లో పడేస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా తో పాటు అనేక న్యూస్ చానెల్స్ లలో దీనిపై చర్చ నడుస్తుంది. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ కి సపోర్ట్ చేసారు పవన్..గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి కేవలం సింగిల్ స్థానానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఆ సింగిల్ కూడా వైసీపీ లో కలిసిపోయింది.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగాలని ఒప్పందం చేసుకున్నాయి. రెండు పార్టీల అధినేతల ఇప్పటి వరకు పలు మార్లు సమావేశాలు కూడా అయ్యారు. అయితే సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నాయి. దీనిపై క్లారిటీ వస్తే ఒకే వేదికపై ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి పవర్ షేరింగ్ ఉండాలంటూ పవన్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే నేతలు కూడా కొందరరు ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో దీనిపై కూడా ఇరు అధినేతలు చర్చలు జరుపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ కు బిజెపి భారీ ఆఫర్ ఇచ్చినట్లు ఓ వార్త వినిపిస్తుంది. లోక్ సభ పోటీలో నిలిచి గెలిస్తే..కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. జనసేన తో బిజెపి పొత్తు ఉంటుందని మొదటి నుండి చెపుతూ వస్తున్నారు..అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఈ ఆఫర్ ఇచ్చారనే వార్త వినిపిస్తుంది.

కాకినాడ (Kakinada)లోక్‌సభ స్థానం నుంచి పవన్ పోటీ చేయబోతున్నారని అంటున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉండే కాకినాడ సీటు సేఫ్టీగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన పదేపదే ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే పర్యటిస్తున్నారని చెపుతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు అన్ని సర్వేల్లో తేలింది. కాబట్టి పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగా పవన్ లోక్ సభ కు పోటీ చేస్తున్నాడా..? ఇది నిజమేనా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే జనసేన కు అంతకన్నా పెద్ద మైనస్ మరోటి ఉండదు.

Read Also : U19 CWC 2024 Semi-Finals: నేపాల్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన యువ భారత్‌

  Last Updated: 03 Feb 2024, 10:28 AM IST