Pawan Kalyan Helping to Old Woman : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మనసు ఎంతో గొప్పదో..మనందరికీ తెలియంది కాదు…మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన పవన్..పేదవాడి బాధలు ఎలా ఉంటాయో తెలిసినవాడు. పేదవాడి కోర్కెలు ఉండేదుకు ఇల్లు , కట్టుకునేందుకు బట్టలు , తినేందుకు తిండి ఉంటె చాలు..ఇంతకన్నా ఏమికోరుకోడు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా తాను అధికారంలోకి వచ్చాక అవన్నీ అందజేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే ప్రజలకు ఏంకావాలో ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. డిప్యూటీ సీఎం (Deputy CM Pawan Kalyan) గా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికీ సాయం చేస్తూ ప్రజానేత గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయ్యా కష్టం వచ్చిందంటే చాలు…క్షణాల్లో ఆ కష్టం నుండి బయటపడేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంతో మంది కష్టాలను తీర్చిన పవన్..తాజాగా ఓ వృద్ధురాలి (Old Woman) పవన్ కళ్యాణ్ ను కలిసి తన కష్టాన్ని చెప్పుకునేందుకు ఆకివీడు (Akividu) నుండి విజయవాడ (Vijayawada) కు వచ్చింది.
వృద్ధురాలికి ముందు భోజనం పెట్టి..ఆ తర్వాత ఆమె సమస్యలు విన్న పవన్
పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ కమిషనరేట్ కి వస్తున్నారని తెలుసుకొని గేటు బయట కూర్చోంది. సమావేశం ముగించుకొని వెళ్తుంటే..ఆ వృద్ధురాలిని చూసి..దగ్గరికి వచ్చి చలించిపోయారు పవన్. పాపం ఆ పెద్దావిడ.. ఎప్పుడు తిన్నాదో ఏమో అని చెప్పి.. తన సిబ్బంది వాహనంలోకి ఆమెను ఎక్కించి తన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ముందు ఆమెకు భోజనం పెట్టించి ఆ తరవాత ఆమె సమస్యలు విన్నారు. తాను ఆకివీడులోని చేయానగరం ప్రాంతానికి చెందిన కృష్ణవేణి అని..తన భర్త మరణించడం తో ఒక్కగానొక్క కొడుకు ముత్తయ్య బొమ్మలు అమ్ముకొంటూ ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఓ రేకుల షెడ్ లో నివాసం ఉంటున్నాం. తనకు వచ్చే వృద్ధాప్య పింఛను మందులకు సరిపోతుంది. ఇంటి స్థలం ఉన్నా, తనకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదని, కొడుకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇల్లు కట్టించాలని ఆమె పవన్ కళ్యాణ్ ను కోరింది. ఆమె ఆవేదన చూసి చలించిపోయిన పవన్ వెంటనే స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ కు ఈ వృద్ధురాలి బాధలు తెలియచేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ ఒక్క మాట తో పెద్దావిడ ఇల్లు నిర్మాణం మొదలైంది
కృష్ణవేణిని జాగ్రత్తగా ఆకివీడు పంపి, కొడుకుకి అప్పగించాలని చెప్పడం తో ..డిప్యూటీ సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఆమెను ప్రత్యేక వాహనంలో ఆకివీడు చేర్చి ఆమె కుమారుడు ముత్తయ్యకు అప్పగించారు. జిల్లా కలెక్టర్ సిహెచ్.నాగరాణి ఆదేశాలతో గృహ నిర్మాణశాఖ అధికారులు కృష్ణవేణికి ఆకివీడులోని ఉప్పనపూడి లే అవుట్ లోని 1896 సర్వే నంబరులో ఉన్న స్థలాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. అక్కడ ఇంటి నిర్మాణం నిమిత్తం అవసరమైన నిధులు మంజూరు చేశారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పవన్ ఒక్క మాట తో తన ఇంటి నిర్మాణ పనులు మొదలు కావడం తో ఆ పెద్దావిడ ఆనందం అంత ఇంత కాదు..పవన్ తనకు మరో కొడుకు అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసి పార్టీ శ్రేణులు, అభిమానులు మరోసారి పవన్ గొప్పతనం గురించి మాట్లాడుకోవడం చేసారు.
Read Also : Mega Family Donation : రూ.9.4 కోట్ల ‘మెగా సాయం’ చేసిన మెగా హీరోస్..