Site icon HashtagU Telugu

Pawan Kalayan : మీడియా డిబేట్ లో నా పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు – పవన్ సూచన

Pawan Kalyan comments on alliance for next governments and CM Post

Pawan Kalyan comments on alliance for next governments and CM Post

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరింత యాక్టివ్ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) – జనసేన (Janasena) కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమ్మలో ఇరు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ముమ్మరం చేసేందుకు వేగవంతంగా అడుగులు వేస్తున్నారు. ఈ రెండు పార్టీల సమన్వయం కోసం ఏర్పాటైన కమిటీ తొలిసారి భేటీ కాబోతోంది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి వేదికగా లోకేష్ (Nara Lokesh) – పవన్ అధ్యక్షతన ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమవుతోంది. తదుపరి ఉద్యమ కార్యాచరణ, ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు.

ఈ తరుణంలో నేడు పార్టీ అధికార ప్రతినిధులతో (Janasena Spokespersons) పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పార్టీ వైఖరిని అధికార ప్రతినిధులకు వివరించారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి వ్యవహరించాలని, పాలనాపరమైన విధివిధానాలు, ప్రజలకు ఉపయోగపడే అంశాలపైనే మాట్లాడాలని..తన వ్యక్తిగత విషయాలు , సినిమాల గురించి మాట్లాడొద్దని సూచించారు. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పులను ప్రస్తావించాలని సూచించారు. కుల, మతాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇక సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్నాకే, ఆ సమాచారంపై మాట్లాడడమో, ఆ సమాచారాన్ని జనసేన కేంద్ర కార్యాలయానికి పంపడమో చేయాలి. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంపై స్పష్టత లేనప్పుడు హడావిడి చేయొద్దు. పార్టీ ప్రతినిధులుగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టొద్దు. పార్టీ ప్రతినిధులు పార్టీ కోసమే మాట్లాడాలి తప్ప మరెవరి కోసమో మాట్లాడవద్దు అని పేర్కొన్నారు.

Read Also : Rahul Gandhi : రాహుల్ బబ్బర్ షేర్ కాదు.. పేపర్ పులి – కవిత