Site icon HashtagU Telugu

Pawan Kalyan : అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న పవన్ కళ్యాణ్..?

Pawan Speech 2

Pawan Speech 2

అదేంటి అని ఖంగారు పడకండి..బిజెపి – టిడిపి లో పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ బరి తో పాటు అసెంబ్లీ బరిలో కూడా నిల్చోబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ పెద్దల సూచన మేరకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు.. ఎంపీగా పోటీ చేస్తున్నారని సమాచారం. కాకినాడ (Kakinada) ఎంపీగా పవన్ పోటీచేస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎమ్మెల్యేగా మాత్రం పిఠాపురం నుంచే పోటీ చేయవచ్చని జనసేన పెద్దలు చెబుతున్నారు.

రెండు రోజులుగా ఢిల్లీలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు మకాం వేసిన సంగతి తెలిసిందే. బిజెపి తో పొత్తు గురించి కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , చంద్రబాబు (Chandrababu) లు చర్చలు జరుపుతూ వచ్చారు. కొద్దీ సేపటి క్రితం వీరి భేటీ ముగిసింది. త్వరలో ఏపీలో జరగబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి- టీడీపీ – జనసేన (BJP-TDP-Janasena) పార్టీలు కలిసి బరిలోకి దిగబోతున్నాయి. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు ఫిక్స్ అయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

మొత్తం జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. బీజేపీ పెద్దల సూచన మేరకు పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారని, కాకినాడ పార్లమెంట్ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు చెపుతున్నట్లు చెపుతున్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, హిందూపురం, రాజంపేట నుంచి బీజేపీ పోటీ చేస్తుండగా.. కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. మచిలీపట్నం నుంచి ఎంపీ బాలశౌరి పోటీ చేయబోతున్నట్లు చెపుతున్నారు.

మరికొంతమంది మాత్రం కాకినాడ (Kakinada) ఎంపీ తో పాటు పిఠాపురం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయబోతున్నట్లు అంటున్నారు. ఒకవేళ ఓ చోట ఓడిపోయిన మరో చోట విజయం సాధించవచ్చు కదా అన్నట్లు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Small Savings Schemes: చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యధాతథం