Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఫిక్స్

Pawan Kalyan Telangana Camp

Pawan Kalyan Telangana Camp

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (Jagan) సిద్ధం (Siddham) పేరుతో ప్రజలను కలుస్తుంటే..చంద్రబాబు (Chandrababu) రా..కదలిరా (Raa..Kadalira) అంటూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ (Nara Lokesh) సైతం సమర శంఖారావం యాత్ర ను ఫిబ్రవరి 11 నుండి ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడుతున్నారు. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

మొదటిరోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు. తదుపరి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతోనూ పర్యటనలో భాగంగా పవన్ భేటీ అవుతారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులతోనూ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరుపార్టీల నాయకులు శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరగనున్నాయి.

పవన్‌కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. తొలి దశలో ముఖ్య నాయకులతో సమావేశాలు ఉండనున్నాయి. రెండో సారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పాల్గొననున్నారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు, ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్‌ మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది.

Read Also : Chandrababu : చంద్రబాబు లక్కీ నెంబర్ రోజున వ్యూహం – RGV