Site icon HashtagU Telugu

Pawan Alliance: ముగ్గురం కలిసే వస్తున్నాం… పొత్తు కుదిరిందిగా

Pawan Alliance

New Web Story Copy 2023 07 18t164526.415

Pawan Alliance: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన ఒక్కసారిగా దూసుకొచ్చింది. వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. అధికార పార్టీ వైసీపీపై విమర్శలు చేస్తూ ఆ పార్టీకి గుదిబండగా మారారు. ఇదిలా ఉండగా బీజేపీ మిత్రపక్షంతో ఈ రోజు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించగా, టీడీపీకి ఆహ్వానం అందలేదు. దీంతో టీడీపీని ఒంటరిని చేసి జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నట్టు కొందరు భావించారు. అయితే బీజేపీ మిత్రపక్ష సమావేశానికి టీడీపీని ఎందుకు ఆహ్వానించలేదనే విషయం కేవలం అదొక రాజకీయ ఎత్తుగడగానే తేలింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మిత్రపక్ష సమావేశం అనంతరం క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేశారు.

2024 అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ, జనసేన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ సీఎం కాకూడదని స్పష్టమైన క్లారిటీతో ముందుకెళ్తుంది. కాగా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే పోటీ చేస్తాయి అంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Also Read: Pm Modi: అదొక అవినీతి సమూహం, ప్రతిపక్షాల సమావేశంపై మోడీ విమర్శలు

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరనేది సమస్య కాదు. అయితే నన్ను సీఎంగా చూడాలని జనసేన కేడర్ కోరుకుంటుందని అన్నారు పవన్. ఎన్నికల సమయంలోనే సీఎంపై స్పష్టత వస్తుందని చెప్పారు పవన్. 2014లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే పని చేశాం. అయితే 2019లో విడిపోయామని పవన్ అన్నారు. 2020లో బీజేపీ జనసేన ఒకే వేదికపై వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కచ్చితంగా కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Also Read: Reverse Politics : యువ‌గ‌ళంపై YCP కోవ‌ర్ట్ యాంగిల్