Site icon HashtagU Telugu

Pawan Kalyan : మ‌రియ‌మ్మ‌ కు ఆటో గిఫ్ట్ ఇచ్చిన పవన్

Pawan Gift

Pawan Gift

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల్లో విజయం సాధించాలని ఎంతోమంది కోరుకున్నారు. దేవుళ్ళకు పూజలు చేసారు. మొక్కలు మొక్కుకున్నారు..పదేళ్లు గా ప్రజల కోసం కష్టపడుతూ..తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి తమ కష్టాలు తీర్చేందుకు కష్టపడుతున్న పవన్ కళ్యాణ్..ఈసారి ఎలాగైనా గెలిపించుకుంటామని ప్రజలంతా ఏకమయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులు , నటి నటులు సైతం ఏదైతే..అది అవుతుందని నడుం బిగించారు. ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేసారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించి చూడండి..మీ భవిష్యత్ మారిపోకపోతే చూడండి అంటూ ప్రజలను ఆకట్టుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఓటర్లు సైతం ఒకటి , రెండు కాదు దాదాపు 70 వేల మెజార్టీ తో పవన్ కళ్యాణ్ ను గెలిపించారు. కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే కాదు పవన్ పార్టీ తరుపున నిల్చున్న 21 అసెంబ్లీ అభ్యర్థులను , 2 పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించి పవన్ కు అసలైన విజయాన్ని అందించారు. ఇక్కడ ఈసందర్బంగా ఎన్నికల ప్రచారంలో మ‌రియ‌మ్మ‌ (Mariyamma) అనే మహిళా ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ రిక్షా కార్మికుడి భార్య‌ మరియమ్మ. ప‌వ‌న్ పై అభిమానంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో ‘మా ప‌వ‌న్ గెలిస్తే.. మా ఆయ‌న రిక్షా తొక్కి తెచ్చిన సొమ్ముతో ఊరంతా పండ‌గ చేస్తా’ అంటూ ఆమె పేర్కొన్న వ్యాఖ్య అప్పట్లో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్య పవన్ కళ్యాణ్ వరకు చేరడం తో ఒక సంద‌ర్భంలో ఆయ‌న “ప్ర‌జ‌లు న‌న్ను చాలా బ‌లంగా కోరుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.

ఇక పవన్ గెలిచిన తర్వాత ఒక‌రోజు రిక్షా తొక్క‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌తో స్వీట్లు కొని చుట్టుప‌క్క‌ల వారికి పంచి పెట్టింది. ఈ విషయం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తెలిసింది. దీంతో చ‌లించిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆ కుటుంబానికి ‘స్పెషల్ గిఫ్ట్’ అందించాల‌ని పార్టీ నాయ‌కుల‌ను ఆదేశించారు. అంతే.. ఇంకేముంది.. జ‌న‌సైనికులు ఆ కుటుంబానికి ఆటో బహుమానంగా ఇచ్చి వారిని సంతోష పరిచారు. దీనిపై మరియమ్మ, ఆమె భర్త హర్షం వ్యక్తం చేస్తూ.. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. త‌మ జీవితాల్లో వెలుగు వ‌చ్చిందంటూ మరియమ్మ సంతోషం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న భర్త 20 ఏళ్లుగా రిక్షా తొక్కుతున్న‌ట్టు ఆమె తెలిపారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆటో అందించడంతో త‌మకు మ‌రింత ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంద‌ని మ‌రియ‌మ్మ పేర్కొంది.

Read Also : Wear Slippers: స్నానం చేసేటప్పుడు బాత్రూంలో చెప్పులు వేసుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే?