AP Politics: భీమవరం బరిలో పవన్ కళ్యాణ్, గెలుపు వ్యూహాలపై ఫోకస్

AP Politics: త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు సీట్ల కేటాయింపుపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ చీఫ్‌కు సొంత ఇంటిని వెతికే పనిలో పడ్డారట జనసేన నేతలు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ విషయంలో నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ప్రజల్లో ఆ భావన ఉండకుండా చేసేందుకు సొంత […]

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Pawan Kalyan will start a new Program Praja Court from Janasena

AP Politics: త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు సీట్ల కేటాయింపుపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ చీఫ్‌కు సొంత ఇంటిని వెతికే పనిలో పడ్డారట జనసేన నేతలు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ విషయంలో నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం.

ప్రజల్లో ఆ భావన ఉండకుండా చేసేందుకు సొంత ఇంటిని ఏర్పర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ చూస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ భీమవరంలోనే బస చేయనున్నారు. పొత్తులు, సీట్ల కేటాయింపుల నేపధ్యంలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్.

గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయగా.. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి పోటీ చేస్తోన్న నేపధ్యంలో కేవలం ఒక నియోజకవర్గం నుంచే పవన్ పోటీ చేయనున్నారట. అది కూడా భీమవరం నుంచేనని జనసేన కేడర్ చెబుతోంది.

  Last Updated: 20 Feb 2024, 05:54 PM IST