Pawan Kalyan : టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్..

గుంటూరులోని తెనాలిలో నేడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆయన విమర్శించారు.

  • Written By:
  • Publish Date - April 14, 2024 / 09:34 PM IST

గుంటూరులోని తెనాలిలో నేడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆయన విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలను అన్యాయంగా కొట్టించిన ఘనత సీఎం జగన్ ది అని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే నిజంగా చిత్తశుద్ధి గా పని చేస్తే ఎలా ఉంటుందో తెనాలి నుంచి చూపిస్తామని, ఒక ఆశయం కోసం వచ్చిన నాకు, రెండు చోట్ల ఓటమి ఎదురైందని, అయి ప్రజల కోసమే తట్టుకొని నిలబడ్డానని ఆయన పేర్కొన్నారు. నేను ప్రజల బరువు మోసే కూలీని అని ఆయన అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ కింద బడే రోజు ఎంతో దూరంలో లేదని, నెల రోజుల్లో పే జగన్ కి అధికార అహంకారం దిగిపోతుందన్నారు. జగన్‌కు అధికార అహంకారం నెత్తికెక్కిందన్నారు. శ్రీలంకలో జరిగిన మాదిరిగా తాడేపల్లి ప్యాలస్ లోకి ప్రజలు వెళ్లి తిరగబడే రోజు వస్తుందన్నారు. అధికారం లో కి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు నాలుగు లైన్ల రోడ్లు విస్తరిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని గా కొనసాగి ఉంటే, తెనాలికి అద్భుతమైన అభివృద్ధి జరిగేదని, కొల్లిపర ప్రాంతంలో, కృష్ణా నదిపై చెక్ డాంలు నిర్మిస్తామన్నారు. పూడికతో తెనాలి కాలువలు దుర్గంధం వెద జల్లుతున్నాయన్నారు. తెనాలికి దుర్గందం నుంచి విముక్తి కల్పిస్తామని ఆయన తెలిపారు.

కులగణంకాలతో పాటు, ప్రతిభాగణంకాలు కూడా లెక్క వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహిళలు వంటింటికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు… ఆర్థిక అభివృద్ధి కోసం మహిళలకు చేయూతనిస్తామన్నారు. నీ ఇల్లు దగ్గరికి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందించేలా చర్యలు తీసుకుంటామని, మహిళలపై చెయ్యి వేయాలంటే, భయపడేలా చట్టాలు తీసుకొస్తాని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కౌలు రైతులకు జనసేన చేసిన సాయం మెగాస్టార్ చిరంజీవిని కూడా కదిలించింది… అందుకే ఆయన జనసేనకు ఐదు కోట్ల ఆర్థిక సాయం అందించారని, ఎస్సైగా పనిచేస్తే చాలు , డిఎస్పీగా రిటైర్ అయితే చాలు అనుకునే మనస్తత్వం మాది అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఈరోజు ప్రజల ముందు ప్రజాసేవకుడిగా నిలబడే స్థితికి చేరానని, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది …ఆ టాలెంట్ను బయటకు తీసి దేశానికి పనికొచ్చేలా చేయాలి. అదే ప్రజా ప్రతినిధులు చేయాల్సిందన్నారు. ప్రజాక్షేమం కోరుకునే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటేనే, రాష్ట్రం బాగుపడుతుందన్నారు.
Read Also : Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు