Site icon HashtagU Telugu

Pithapuram : నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్..తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు

Pawan Nomination

Pawan Nomination

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram ) ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ (Nomination) వేశారు. ఏపీలో నాల్గు రోజులుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులు భారీ ర్యాలీతో వచ్చి తమ నామినేషన్ ను దాఖలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు , నారా లోకేష్ , బాలకృష్ణ వంటి కీలక కూటమి నేతలు తమ తమ నామినేషన్ లను వేయగా.,..ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా పవన్ కళ్యాణ్ తన నామినేషన్ ను దాఖలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా చేబ్రోలులోని నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తన కుటుంబ సభ్యులు, సన్నిహుతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కార్యాలయానికి బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వెంట వేలాది మంది అభిమానులు , పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. జై జైనసేన, జైజై పవన్ కల్యాణ్ అంటూ భారీగా నినాదాలు చేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఏ ర్యాలీకి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇక ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Read Also : Childrens Seats : పేరెంట్స్ పక్కనే పిల్లలకు సీటు.. ఎయిర్ లైన్స్‌కు ఆదేశాలు