చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో టీడీపీ నేతలు , కార్యకర్తలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రెండు రోజులుగా చంద్రబాబు అరెస్ట్ తో యావత్ ప్రజానీకం ఏంజరగబోతుందో అని టెన్షన్ పడుతుంటే..టీడీపీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉండడం..పెద్దగా రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు కానీ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపకపోయేసరికి అంత షాక్ అవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, ఎన్ని గొడవలు , ఎన్ని అల్లర్లు జరుగుతాయో..ప్రభుత్వానికి ఎంత ఆస్థి నష్టం వాటిల్లుతుందో అని అంత ఖంగారు పడ్డారు కానీ..అదేమీ లేదు. ఎక్కడిక్కడే సైలెంట్ గా ఉన్నారు.
కానీ ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మరోసారి వార్తల్లో నిలిచారు. చంద్రబాబు కు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా నేరుగా వెళ్లి చంద్రబాబు ను కలుస్తానని చెప్పలేదు. అయినప్పటికీ ఏపీ పోలీసులు నిన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను విజయవాడ కు రాకుండా అడ్డుకున్నారు. ముందుగా విమానంలో వద్దామని అనుకుంటే..కుదరలేదు. చివరికి రోడ్డు మార్గాన వస్తుంటే జగ్గయ్య పేట లో (Pawan Kalyan Stopped) అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయం..ఓ పక్క జోరున వర్షం పడుతుంది. అయినప్పటికీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పవన్ కు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ను పంపించకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఎన్నో ఉద్రికత్తతల నడుమ చివరకు పోలీసులే పవన్ కళ్యాణ్ ను తన ఆఫీస్ వద్దకు తీసుకెళ్లి దింపారు. ఇంత జరుగుతున్న కానీ టీడీపీ నేతలు కానీ , కార్యకర్తలు రోడ్ల పైకి రావడం చేయలేదు.
తాజాగా ఇదే అంశాన్ని మాజీ మంత్రి , వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar yadav) చెపుతూ టీడీపీ కార్యకర్తలను తక్కువ చేసారు. చంద్రబాబు పాపం పండిందని, ఆయనో అవినీతి ఆనకొండ అన్న అనిల్..చంద్రబాబు అరెస్ట్ అయితే..టీడీపీ నేతలు ఇంట్లో టిఫిన్ తిని ప్రశాంతంగా ఉంటున్నారని, తమకు అనుకూలమైన మీడియాకు వాయిస్, వీడియో బైట్లు ఇస్తూ ఇంట్లో సైలంట్‌గా కూర్చొని ఉన్నారని అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్..పురందేశ్వరి లు చంద్రబాబు కు సపోర్ట్ చేస్తున్నారని అనిల్ చెప్పుకొచ్చాడు.
సీఐడీ కేసులో మరిదికి పురందేశ్వరి వత్తాసు పలికారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసినంత హడావిడి టీడీపీ కార్యకర్తలు, సొంత కొడుకు కూడా చేయలేదని అనిల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడే.. కుటుంబ సభ్యుడు కాదన్నారు. తన పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసినట్లు నానా యాగీ చేశాడని పవన్ పై అనిల్ మండిపడ్డారు. దేశ చరిత్రలో ఒక పార్టీ అధ్యకుడ్ని అరెస్టు చేస్తే మరో పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకు రావడం ఇదే తొలిసారి అన్నారు.
నిన్నటి చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయిందని ..ఒక్క కార్యకర్త కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదన్నారు. తద్వారా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు నోరు మెదపలేని పరిస్ధితుల్లోకి వెళ్లిపోయారని అనిల్ ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్, పురందేశ్వరి మాత్రం చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారని అనిల్ విమర్శించారు.