Site icon HashtagU Telugu

Andhra Pradesh: ఇద్ద‌రు నానిలకు.. పీకే ఫ్యాన్స్‌ బిగ్‌షాక్‌..!

Bheemla Nayak99

Bheemla Nayak99

జ‌న‌సేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో, పీకే ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ర‌చ్చ చేస్తున్నారు. ఇక ఏపీలో భీమ్లా నాయ‌క్ మూవీ విడుద‌ల నేప‌ధ్యంలో థియేట‌ర్ల‌ యాజ‌మానుల‌కు ఏపీ స‌ర్కార్ హెచ్చిరిక‌లు జారీ చేసింది. ఈ క్ర‌మంలో భీమ్లా నాయ‌క్ మూవీ బెనిఫిట్ షోలు వేసినా, ఎక్కువ రేట్ల‌కు టికెట్లు అమ్మినా, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఏపీ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది.

అయితే మ‌రోవైపు తెలంగాణ‌లో మాత్రం భీమ్లా నాయ‌క్‌కు బెన్‌ఫిట్ షోలకి, ఐద‌వ షోకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డ‌మే కాకుండా, టికెట్ రేట్లు పెంచుకునే అవ‌కాశం కూడా కల్పించారు. దీంతో పీకే ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో నిర‌స‌న‌లు తెలిపారు. భీమ్లా మూవీ బెనిఫిట్ షోల కోసం గురువారం రాత్రి నుంచే ప‌వ‌న్ అభిమానులు ప‌డిగాపులు కాశారు.. అయితే షోలు వేయ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్ పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం తీరుతో మండిపోయి ఉన్న పీకే ఫ్యాన్స్ సెగ వైసీపీ మంత్రుల‌కు సోకింది. ఈరోజు ఇద్దరు వైసీపీ మంత్రులు ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా, పవన్ ఫ్యాన్స్ అడ్డుకున్నట్టు సమాచారం.

ఈరోజు గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి వైసీపీ కీల‌క మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్ అభిమానులు షాక్ ఇచ్చారు. ప్రారంభ చిత్రంగా థియేటర్‌లో భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రదర్శించింది ఆ థియేటర్ యాజమాన్యం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కొడాలి నాని, పేర్ని నానిలను థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్ర‌మంలో జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. సినిమాల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద ఎత్తున వ్యతిరేకతని తెలిపారు.

దీంతో ధియేట‌ర్ య‌జ‌మానులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో, రంగంలోకి దిగిన పోలీసులు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్‌తో పాటు పలువురు ప‌వ‌న్ అభిమానులను అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో పీకే ఫ్యాన్స్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్ర‌మే రూల్స్ ఉన్న‌యాని, జ‌గ‌న్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమ‌ని ప‌వ‌న్ అభిమానులు, జనసేన నాయకులు మండిప‌డుతున్నారు. ఇక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని జనసేన పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.