Site icon HashtagU Telugu

Pawan Kalyan : ర్యాలీలో స్టెప్స్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపిన పవన్ కళ్యాణ్

Pawan Dance

Pawan Dance

ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లో జోష్ పెరుగుతుంది. ప్రచారంలో తన దూకుడు పెంచుతూ..జగన్ ఫై విమర్శల వర్షం కురిపిస్తూనే..తనకోసం వచ్చిన పార్టీ శ్రేణుల్లో , అభిమానుల్లో తనదైన శైలి లో డాన్సులు వేస్తూ వారిలో ఊపు తెప్పిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియా లో సరికొత్త ట్రేడ్ సెట్ చేస్తుండగా..తాజాగా ఈరోజు కూడా కాకినాడ ఎంపి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (Tangella Uday Srinivas) నామినేషన్ ర్యాలీ (Nomination Rally)లో పవన్ కళ్యాణ్ ప్రచార రథంపై స్టెప్స్ వేస్తూ జనసైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఏపీలో నామినేషన్ల పర్వం చివరికి రావడం తో కీలక అభ్యర్థులంతా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం లో నామినేషన్ వేశారు. పవన్ నామినేషన్ సందర్బంగా దాదాపు లక్ష మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ లోను అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. నామినేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..కూటమి ఉమ్మడి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ వేశారు. ప్రజలు అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.

ఉదయ్ విషయానికి వస్తే..

దుబాయ్ లో మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి, భారత్ కు వచ్చి ‘టీ టైమ్’ పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చెయిన్ ప్రారంభించి, కోట్ల రూపాయల టర్నోవర్ తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు. 2016లో రూ.5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ షాప్ స్థాపించగా… ఇప్పుడు టీ టైమ్ ఫ్రాంచైజీల సంఖ్య 3 వేలకు పెరిగింది. టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ రూ.35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు.
రాజకీయాలు, ప్రజాసేవపై ఆసక్తితో ఉదయ్ .. ఏపీ వైపు దృష్టి సారించాడు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేన అని గుర్తించాడు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో ఇంకేమీ ఆలోచించకుండా జనసేన పార్టీలో చేరాడు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనలను ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు.

Read Also : Viral : హనుమాన్ ఆలయాన్ని పబ్లిక్ టాయిలెట్‌గా మార్చేశారు ..