Gannavaram : ఆడవాళ్లను అవమానించే వ్యక్తి ‘వల్లభనేని వంశీ ‘ – పవన్ కళ్యాణ్

వల్లభనేని వంశీకి జనసేన మద్దతుదారులు కానీ ప్రజలు కానీ పొరపాటును కూడా ఓటేయొద్దని, అతడు ఆడవాళ్లను అవమానించే వ్యక్తి అని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 04:56 PM IST

ఏపీలో కీలక స్థానం గన్నవరం (Gannavaram )..టీడీపీ (TDP) కి అడ్డా ఇది. అలాంటి ఈ స్థానం ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ నుండి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) విజయం సాధించారు. కానీ ఆ తర్వాత వైసీపీ లో చేరారు. ఇప్పుడు వైసీపీ నుండి గన్నవరం నుండి బరిలోకి దిగగా..టీడీపీ నుండి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) బరిలో నిలుచున్నారు. ఈ క్రమంలో ఈరోజు జనసేన ధినేత పవన్ కళ్యాణ్ ,,వెంకట్రావు తరుపున గన్నవరంలో ప్రచారం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వల్లభనేని వంశీకి జనసేన మద్దతుదారులు కానీ ప్రజలు కానీ పొరపాటును కూడా ఓటేయొద్దని, అతడు ఆడవాళ్లను అవమానించే వ్యక్తి అని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.2014లో నేను కూటమికి మద్దతు ఇచ్చినప్పుడు ఇక్కడ వల్లభనేని వంశీ ఏం చెప్పారో నాకు గుర్తుంది. మీరు ప్రచారం చేయడం వల్ల ఎప్పుడూ ఓట్లు పడని ప్రాంతాల్లో కూడా నాకు ఓట్లు పడ్డాయి అని వంశీ మనస్ఫూర్తిగా చెప్పారు. ఆయన మంచి నాయకుడు, ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి అనుకున్నాను… కానీ ఆ తర్వాత ఆయన మారిపోయారు. విభేదాలు ఎవరికుండవు? నేను కూడా చంద్రబాబుతో విభేదించాను, చింతమనేని ప్రభాకర్ తో విభేదించాను. ఎక్కడా కూడా విధానపరంగానే విభేదించాం తప్ప, అంతకుమించి వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

గన్నవరంలో ఎంపీ జనసేనకు, ఎమ్మెల్యే ఓటు తనకు వేయాలని వంశీ అడుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఇది సరికాదని సూచించారు. ఎన్టీఆర్ కుమార్తె పై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. వంశీకి జనసేన శ్రేణులు ఓట్లు వేస్తే అవి మహిళను అగౌరపరిచే వారిని ప్రోత్సహించటం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని పవన్ సూచించారు.

Read Also : Pawan Kalyan : 13న ఏపి దిశ దశ మార్చే ఎన్నికలు రాబోతున్నాయిః పవన్‌ కల్యాణ్‌