Pawan Kalyan: నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాడు. కొన్నాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్ గా ముద్ర వేసుకున్న పవన్ ప్రస్తుతం ఫుల్ టైం పొలిటీషియన్ గా కొనసాగుతున్నాడు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పవన్ దూకుడు పెంచాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పార్టీని నడుపుతున్నాడు. ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర చేపట్టారు. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పవన్ పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అధికార పార్టీ వైసీపీని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సీఎం జగన్ ఏ టార్గెట్ గా పవన్ వ్యవహరిస్తున్నాడు.
వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ సినిమా హీరోలను తెరపైకి తీసుకొచ్చాడు. ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు తనకంటే పెద్ద నటులు అంటూ చెప్పుకొచ్చాడు. వాళ్లంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారని, నేను వాళ్ళ అంత పెద్ద నటుడిని కాదని యాత్రలో మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి పెద్ద హీరోల పేర్లను ప్రస్తావించడం వెనుక కూడా రాజకీయ ఎత్తుగడ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా పవన్ తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికరంగా రివీల్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ ఇటీవల ఏలూరులో పార్టీ నేతలు, మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.దేశంలోని పెద్ద నటుల్లో నేనూ ఒకడిని. ఇతర అగ్ర హీరోలతో పోటీపడని సాధారణ హీరోగా నేను ఏడాదికి దాదాపు 200 రోజులు పనిచేసి దాదాపు 400 కోట్లు సంపాదిస్తున్నాను. కానీ నేను వాళ్ళతో పోటీ పడి సినిమాలు చేస్తే నేను కూడా సులభంగా 1000-1500 కోట్లు సంపాదించగలను. కానీ నేను ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాను, నేను డబ్బుకు ఆశపడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తో సాహూ తీసిన సుజిత్ OG చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఆయన నటించిన BRO చిత్రం విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ఆ చిత్రం విడుదలై ప్రేక్షకుల్ని అలరించనుంది. BRO చిత్రంలో పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.
Read More: AP Minister Botsa: చూచి రాతలు, కుంభకోణాలు.. తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రి బొత్స కామెంట్స్