Pawan Kalyan : సొంత పార్టీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా పదేళ్లు గా పార్టీ కార్యక్రమాలకే అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బును కూడా బ్రేక్ చేసి పార్టీ కోసం ఇస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపించాయి.

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 07:54 PM IST

జనసేన పార్టీ (Janasena Party) అవసరాల కోసం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ విరాళం అందజేశారు. రూ.10 కోట్ల చెక్కులను (Pawan Kalyan DONATES 10 CRORE RUPEES) పార్టీ కోశాధికారి ఏవీ రత్నానికి అందించారు. ఈ డబ్బును సామాజిక, ఆధ్యాత్మిక, అత్యవసర సేవలకు వినియోగించాలని సూచించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా పదేళ్లు గా పార్టీ కార్యక్రమాలకే అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల ఫిక్సెడ్ డిపాజిట్ డబ్బును కూడా బ్రేక్ చేసి పార్టీ కోసం ఇస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపించాయి. కేవలం పార్టీ కోసమే కాకుండా.. సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు విరాళం ఇస్తుంటారు. కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తలా ఓ లక్ష రూపాయలు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దాదాపు రూ. 30 కోట్లకుపైగా కౌలు రైతులకు అందజేయడం జరిగింది. ఏ రాజకీయ నేతైనా జేబులో నుండి డబ్బు ఖర్చు పెట్టడం చాల అరుదు. ముఖ్యంగా పదవిలో లేకపోయినా జేబులో నుండి డబ్బు ఖర్చు చేయడం అది కూడా పదేళ్లుగా కోట్ల రూపాయిలు ఖర్చు చేయడం అనేది ఒక్క పవన్ కళ్యాణ్ కే చెల్లింది. మరి ఎంత చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఈసారి ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి.

ఇప్పటికే పలుమార్లు పార్టీ కి భారీ విరాళాలు అందజేసిన పవన్..ఈరోజు మరో రూ. 10 కోట్లను అందజేసారు. జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం రూ.10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి‌.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.

Read Also : Chandrababu : ఎన్నికల వేళ వరాలు కురిపిస్తున్న బాబు..