Site icon HashtagU Telugu

Pawan : గుర్ల మృతుల‌కు ఒక్కొక్క‌రికి రూ. ల‌క్ష సాయం – పవన్ నీది ఎంత గొప్ప మానసయ్య..!!

Pawan One Lakh Donation For

Pawan One Lakh Donation For

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎవరు ఆపదలో ఉన్న..కష్టాల్లో ఉన్న సామీ..అని తన వద్దకు వెళ్లిన..కష్టాల్లో ఉన్నారు అని తన దృష్టికి వెళ్లిన సరే ఏమాత్రం ఆలోచించకుండా తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు పవన్. ఇప్పటివరకు వందల కోట్లను ప్రజలకు దానం చేసాడు.. చేస్తూనే ఉన్నాడు. రాజకీయాల్లోకి వస్తే ఏ నేతయినా జేబులు నింపుకోవాలని , బ్యాంకు బాలన్స్ ఫిల్ చేసుకోవాలని , ఆస్తులు కూడబెట్టుకోవాలని చూస్తారు..కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా తన జేబులో నుండి డబ్బులు పంచడమే కానీ నింపుకోవడం తెలియని వ్యక్తి. ఇది చాల సందర్భాల్లో చెప్పిన మాటే.

ఈరోజు కూడా అలాగే తన గొప్ప మనసును చాటుకొని వార్తల్లో నిలిచారు. నేడు సోమవారం విజయనగరం (Vizianagaram) జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. జిల్లాలో అతిసార వ్యాధి (Diarrhea) ప్రబలడంపై, త్రాగునీరు కలుషితం అంశాలపై విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అనంత‌రం ప‌వ‌న్ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా అతిసార ప్ర‌భ‌ల‌డానికి బహిరంగ మలవిసర్జన కారణమ‌న్నారు. దీనివ‌ల్ల నీటిని కలుషితమ‌వుతున్నాయ‌ని , నీటి కాలుష్యంతో ప్రాణాలు పోవ‌డమే కాకుండా , సామాన్య ప్రజల అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నార‌ని తెలిపారు. నీరు క‌లుషితం కాకుండా ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ భాద్యతగా వ్య‌వ‌హ‌రించి, ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించాల‌న్నారు. అధికారులు, పంచాయతీ సర్పంచ్ లు ఈ భాధ్యత తీసుకోవాలన్నారు. గుర్ల గ్రామం (Gurla Village)లో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా లక్ష రూపాయల అందించనున్న‌ట్లు ప్రకటించారు.

Read Also : Farooq Abdullah : కశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు : ఫరూక్‌ అబ్దుల్లా