ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్త ఏడాది (New Year) సందర్భంగా ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలలో ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన భావిస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకోవడమే కాకుండా, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజల మద్దతు తెలుసుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలతో నేరుగా మమేకమవ్వడానికి స్ఫూర్తిదాయకంగా మారింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభివృద్ధికి అవసరమైన విషయాలను నేరుగా తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సూచనలు చేయడానికి ఈ పర్యటనలు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వ్యక్తిగతంగా పాలుపంచుకోవడమే తన ముఖ్య ఉద్దేశమని పవన్ స్పష్టంచేశారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించి షెడ్యూల్, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రతి జిల్లాలో ప్రజల స్థితిగతులను నేరుగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు. ప్రభుత్వ విధానాల అమలు ఫలితాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో నేరుగా తెలుసుకోవడం ఆయన ముఖ్య లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి జిల్లాలో పర్యటించాలనే పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను బలపరిచే విధంగా మారనుంది. ప్రజల కోసం సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే తన సంకల్పాన్ని పవన్ మరోసారి రుజువు చేశారు.
ఇక రీసెంట్ గా ఏ ప్రజా నేత అడుగుపెట్టని చోట అల్లూరి మన్యం ప్రాంతంలో పవన్ అడుగుపెట్టి..వారి సమస్యలు తెలుసుకోవడమే కాదు అక్కడ రోడ్లకు శంకుస్థాపన చేసి డోలి మోతలు అరికట్టేందుకు ముందు అడుగు వేసి శభాష్ అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం ఆయన మార్క్ కు ప్రతీకగా కనపడుతుంది.
Read Also : Plain Crash : కజకిస్థాన్ ప్రమాదం ఘటన.. రష్యా అధ్యక్షుడు క్షమాపణలు