Pawan Kalyan Disappointed : అవనిగడ్డ లో పవన్ వెనక్కు తగ్గాడా..? కారణం ఏంటి..?

మొదటి మూడు విడతల్లో ఉన్న జోష్ లేదని..ఎందుకు పవన్ తగ్గి ఉంటాడని ప్రశ్నింస్తున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే అరెస్ట్ ఏమైనా చేస్తారా అని భయపడి తగ్గాడా..?

Published By: HashtagU Telugu Desk
varahi 4th phase yatra

varahi 4th phase yatra

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా 4 వ విడత వారాహి యాత్ర (Varahi Yatra 4th Phase) మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన పవన్..నాల్గొవ విడత ఆదివారం కృష్ణా జిల్లా అవనిగడ్డ (Avanigadda ) లో ప్రారంభించారు. ఈ సందర్బంగా భారీ సభ ఏర్పాటు చేసారు. టీడీపీతో పొత్తు తర్వాత ఫస్ట్ టైం పవన్ ప్రజల్లోకి రావడం తో అంత ఈ సభపై ఆసక్తి పెట్టుకున్నారు. ఈ యాత్ర కు టీడీపీ సైతం మద్దతు పలకడం తో పెద్ద ఎత్తున నిన్న జరిగిన సభలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

ఇక అవనిగడ్డ సభలో పవన్ ఎలాంటి మాటల తూటాలు పేలుస్తారో..? చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై ఎలా స్పందిస్తారో..? టీడీపీ – జనసేన (TDP -Janasena alliance)పొత్తు ఫై ఎలాంటి వివరణ ఇస్తారో..? చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ చేస్తున్న ఆరోపణల ఫై ఎలాంటి కామెంట్స్ చేసారో..? గత యాత్రల్లో ప్రభుత్వ వైఫల్యాలను , మోసాలను , క్రైం ను బయటపెట్టిన పవన్..ఈసారి ఎలాంటి నిజాలు బయటపెడతరో..? అనే అంశాలఫై అంత ఆతృతగా ఎదురుచూసారు. ముఖ్యంగా పవన్ నుండి ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ వస్తాయో..? అని జనసేన శ్రేణులు , అభిమానులు , టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ పవన్ మాత్రం అందర్నీ నిరాశ పరిచారు.

మీరు కౌరవులు, మేం పాండవులం

కేవలం పవన్ నుండి మీరు కౌరవులు, మేం పాండవులం అనే డైలాగ్ తప్పితే… పెద్ద భారీ డైలాగ్స్ పడలేదు. ప్రసంగం మొత్తం సాదాసీదాగానే కొనసాగిందని అంత వాపోతున్నారు. ఈసారి ప్రసంగంలో ఎక్కువగా ఆయన ఉద్యోగాలు , DSC నోటిఫికేషన్ గురించే మాట్లాడారు. జనసేన , టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రాగానే DSC సంగతి చూస్తానన్నారు. ఐతే.. ఈ విషయంలో వైసీపీ కార్యకర్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ అధికార పక్షాన్ని మాటలతోనే కడిగిపారేసేవారు

నందమూరి తారక రామారావులా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఇప్పుడు కష్టం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే అప్పుడు ఎన్టీఆర్ ప్రసంగాలు ఎలా ఉండేవో చాలామందికి తెలుసు. లోతైన భావజాలంతో బలంగా ఉండేవి. ఆయన అధికార పక్షాన్ని మాటలతోనే కడిగిపారేసేవారు. ప్రత్యర్థి నేతలపై విరుచుకుపడేవారు. ప్రతీ డైలాగూ బుల్లెట్ లా పేలేది. అందుకే జనం ఆకర్షితులయ్యారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా చప్పగా సాగిందని అంత మాట్లాడుకుంటున్నారు.

టీడీపీ శ్రేణులు నిరాశకు లోనయ్యారు

ముఖ్యంగా చంద్రబాబు అరెస్టును పవన్ మరోసారి పబ్లిక్ లో ఖండిస్తారని..చంద్రబాబు ఏ తప్పు చేయలేదని చెపుతారు కావొచ్చని టీడీపీ శ్రేణులు భావించారు. కానీ పవన్ మాత్రం అలాంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఎప్పట్లాగే తాను కానిస్టేబుల్ కొడుకుననీ, కష్టపడి పైకొచ్చానీ చాలా పర్సనల్ విషయాలు చెబుతూ… కొన్ని ప్రముఖ రచయితల రచనలను వివరిస్తూ… సాదాసీదాగా ప్రసంగం సాగించారు. దీంతో టీడీపీ శ్రేణులు బాగా నిరాశ చెందారు. మరికొంతమంది మాత్రం పవన్ తగ్గడం స్టార్ట్ చేసాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదటి మూడు విడతల్లో ఉన్న జోష్ లేదని..ఎందుకు పవన్ తగ్గి ఉంటాడని ప్రశ్నింస్తున్నారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే అరెస్ట్ ఏమైనా చేస్తారా అని భయపడి తగ్గాడా..? అని అంత అనుకుంటున్నారు. కానీ ఆలా పవన్ భయపడే వ్యక్తి కాదని..భయం పుట్టించే వ్యక్తి అని మరికొంతమంది చెపుతున్నారు. మరి రాబోయే నాల్గు రోజుల యాత్ర లో పవన్ ఇలాగే సైలెంట్ గా ఉంటాడా..? దూకుడు పెంచుతాడా అనేది చూడాలి.

Read Also : Vijayasai Reddy : టీడీపీ మూడు ముక్కలుగా చీలిపోవచ్చు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

  Last Updated: 02 Oct 2023, 01:57 PM IST