Site icon HashtagU Telugu

Pawan Kalyan Dhimsa Dance : మహిళలతో కలిసి పవన్ కళ్యాణ్ దింసా నృత్యం

Pawan Dhimsa Dance

Pawan Dhimsa Dance

మన్యం జిల్లా పర్యటన(Pawan Kalyan Manyam Tour)లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం(Pawan Kalyan Dhimsa Dance) చేసి ఆకట్టుకున్నారు. స్థానిక మహిళలతో కలిసి ఆయన కాలు కదిపారు. ఇది చూసి అక్కడి వారే కాదు యావత్ అభిమానులు , పార్టీ శ్రేణులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ..ఈ డాన్స్ తాలూకా వీడియోస్ ను షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన జోరు వానలో సాగింది. ఓ పక్క జోరుగా వర్షం పడుతున్న పవన్ కళ్యాణ్ ఏమాత్రం లెక్కచేయకుండా తన పర్యటనను పూర్తి చేసారు. అలాగే మన్యం ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్ కం చెప్పారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది. గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కాలి నడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు కాలికి చెప్పులు లేకుండా నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా మొబైల్ లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సిద్దవటంతోపాటు ఇక్కడ అడ్వంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని.. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియచేయాలని అధికారులకి సూచించారు. ఇక శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద పనికి ఆహార పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించి , రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్ లో వీడియో తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా స్థానిక మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆయన నృత్యం చేసి ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : Formula E Race Case : ఈ ఫార్ములా రేస్ పై రేవంత్ గోబెల్స్ ప్రచారం – హరీశ్ రావు