Pawan Kalyan : పవన్ పూర్తిగా కాపు ఓటర్లపైనే ఆధారపడతాడా..?

ఆంధ్ర ప్రదేశ్‌లో రానున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఎవరికి వారి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తుతో ప్రజల ముందుకు రానుంది. అయితే.. టీడీపీ (TDP)- జనసేన (Janasena)తో బీజేపీ (BJP) కూడా కలిసి మహా కూటమిగా వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ మహా కూటమిలో బీజేపీ పొత్తుపై స్పష్టమైన అడుగులు కనిపించకపోవడంతో టీడీపీ- జనసేన మాత్రమే రంగంలోకి దిగుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. […]

Published By: HashtagU Telugu Desk
Pawan Speech 2

Pawan Speech 2

ఆంధ్ర ప్రదేశ్‌లో రానున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఎవరికి వారి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తుతో ప్రజల ముందుకు రానుంది. అయితే.. టీడీపీ (TDP)- జనసేన (Janasena)తో బీజేపీ (BJP) కూడా కలిసి మహా కూటమిగా వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ మహా కూటమిలో బీజేపీ పొత్తుపై స్పష్టమైన అడుగులు కనిపించకపోవడంతో టీడీపీ- జనసేన మాత్రమే రంగంలోకి దిగుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైన కూడా క్లారిటీ లేకపోవడంతో ఇటు జనసైనికుల్లో.. అటు టీడీపీ వర్గాల్లో మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ గెలుపుకు కలిసివచ్చే విషయాలపై చర్చించుకుంటున్నారు రాజకీయ నిపుణులు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేసే నియోజకవర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒక్కసారిగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకుముందు కూడా పిఠాపురం గురించి చర్చ జరిగింది కానీ అది మెల్లమెల్లగా సద్దుమణిగింది. తొలుత భీమవరాన్నే ఎంపిక చేస్తానని చెప్పిన పవన్.. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును భీమవరం నుంచి పోటీ చేయమని చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు స్పష్టమైంది.

కాగా, జనసేన అధినేత తన గెలుపు అవకాశాలను అంచనా వేసేందుకు ఆ నియోజకవర్గంలో రెండు సర్వేలు చేయించడం వల్లనే పిఠాపురం నియోజకవర్గం తెరపైకి వచ్చిందని జన సైనికులు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపు జనాభా ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణం. పిఠాపురం నియోజకవర్గంలోని మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లలో 60 వేల మంది కాపులే. కాపులు, ఇతర కులాల వారు అందరూ పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే.. ఆయన కచ్చితంగా గెలుస్తారని సర్వేలో తేలింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు, బీసీల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. అలాగే కాపులు, ఎస్సీలు కూడా ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండరు. మొత్తం సమాజం కులాల వారీగా చీలిపోయింది. ఇప్పుడు ఓటర్లు కుల హద్దులు దాటి జన సేనానికి ఓటేస్తారా?
Read Also : Pulse Polio : రేపే పల్స్ పోలియో కార్యక్రమం.. తల్లిదండ్రులారా మర్చిపోకండి

  Last Updated: 02 Mar 2024, 08:34 PM IST