Site icon HashtagU Telugu

Pawan Kalyan Demands: అచ్యుతాపురం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి

Kapu Flaver

Pawan Janasena

అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కర్మాగారాల్లో తరచూ భద్రతా లోపాలు తలెత్తడం ఆందోళనకర పరిణామమన్నారు. దేశ ప్రగతికి పరిశ్రమల ఆవశ్యకత ఎంతో అవసరమని, అయితే ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడే బాధ్యతను విస్మరించరాదన్నారు.

అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో నెలలో రెండుసార్లు విషవాయువులు లీకేజీ అయిన సంఘటనలకు ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. దువ్వాడ, అచ్చుతాపురం, పరవాడ తదితర పారిశ్రామిక వాడల చుట్టుపక్కల కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని సూచించారు. గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని జగన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు.