Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా పవన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్పా అని ప్రశించారు. ప్రకాశ్ రాజ్ అంటే గౌరవం ఉందని, తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. సెక్యూలరిజం అంటే రెండు మార్గాలని, ప్రకాశ్ రాజు తెలుసుకోవాలని సూచించారు. సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని, సరదాగా మాట్లాడే ముందే 100 సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై వ్యంగ్యంగా మాట్లాడితే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పాడాల్సిన బాధ్యత గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. #prakeshraj #AndhraPradeshDeputyCM #Vijayawada #Pawankalyan #temples #HashtagU pic.twitter.com/O3HAToTaPJ
— Hashtag U (@HashtaguIn) September 24, 2024
అంతేకాక.. తిరుమల లడ్డూపై వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, వ్యంగ్యంగా మాట్లాడటానికి ఇది సరైన విషయం కాదని తేల్చిచెప్పారు. తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాలనే అనుసంధానం ఉండాలి కానీ అహంకారంతో మాట్లాడటం సరికాదని పవన్ హెచ్చరించారు. తాను ఏ మతంపై విమర్శలు చేయలేదని, తిరుమల లడ్డూ అపవిత్రం అయితే దానిపై స్పందించడం తప్పేమిటని పవన్ ప్రశ్నించారు. దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నప్పుడు తాను ఎలా నిశ్శబ్దంగా ఉంటానని ఆయన అన్నారు. సనాతన ధర్మంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయకూడదని, ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా మాట్లాడితే తాను ఊరుకోబోనని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి రివర్స్‌లో మాట్లాడుతున్నారని, మౌనంగా ఉండకూడదనే భావంతో అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు చూపిస్తూ, హిందువులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. సెక్యులరిజం అంటే రెండు వైపులా సమానంగా చూడాలని ఆయన సూచించారు.
వైసీపీ నేతలు నన్ను పచ్చి బూతులు తిట్టినా మౌనంగానే ఉన్నా కానీ సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకోను – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #YSRCP #AndhraPradeshDeputyCM #Vijayawada #Pawankalyan #temples #HashtagU pic.twitter.com/CqY100rFlD
— Hashtag U (@HashtaguIn) September 24, 2024