Pawan Kalyan : పిఠాపురం నుండి పవన్ పోటీ..జనసేన వ్యూహం మాములుగా లేదుగా..

మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు పలు నియోజకవర్గాల పేర్లు వినిపించిన ఫైనల్ గా మాత్రం పిఠాపురం (Pithapuram ) నుండి బరిలోకి దిగాలని జనసేన అధినేత డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు. కాకినాడకు 26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. పిఠాపురం నుంచి పోటీచేస్తే […]

Published By: HashtagU Telugu Desk
Pawan Pitapuram

Pawan Pitapuram

మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు పలు నియోజకవర్గాల పేర్లు వినిపించిన ఫైనల్ గా మాత్రం పిఠాపురం (Pithapuram ) నుండి బరిలోకి దిగాలని జనసేన అధినేత డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు. కాకినాడకు 26 కిలోమీటర్లు దూరంలో ఉండే పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికం. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

పిఠాపురం నుంచి పోటీచేస్తే పవన్‌ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన (Janasena) వర్గాల్లో ముందు నుండి చెపుతూ వచ్చాయి.అందుకే పిఠాపురం నుంచి పోటీకి పవన్‌ సై అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీని ప్రకటించారు. మరోవైపు.. కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్‌ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్‌, ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలవచ్చనేది జనసేన వ్యూహంగా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పిఠాపురం ఓటర్లు మాములు వాళ్లు కాదు..ఎందుకంటే..

నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పు ఇస్తూ వస్తుంటారు. 2004లో రాష్ట్ర మంతా కాంగ్రెస్ గాలి వీస్తే.. బీజేపీ తరపున పోటీచేసిన పెండెం దొరబాబు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి వంగా గీత గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో 2009లో టీడీపీ త పున పోటీ చేసి ఓడిపోయిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పోతుల విశ్వం కు టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది.. వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబబాబు పోటీచేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగిన ఎస్వీఎస్ఎన్ వర్మ 47,080 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 2019లో ఒకప్పుడు బీజేపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఇప్పుడు ఎవర్ని ఎంచుకుంటారనేది చూడాలి.

Read Also : TDP Second List : సీనియర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..

  Last Updated: 14 Mar 2024, 04:02 PM IST