Site icon HashtagU Telugu

Pawan Kalyan : రజనీకాంత్‌కి పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : భారతీయ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. “వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజని’ అనే టైటిల్ మెరుస్తూనే థియేటర్లలో ఏర్పడే మారుమోగే కేరింతలు, ఉత్సాహం నాకు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా అనుభవం అయ్యాయి. తరాలు మారినా, టెక్నాలజీ మారినా, సినిమా రూపం మారినా రజనీకాంత్‌ అభిమానుల ఆనందోత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలాంటి అగ్రశ్రేణి నటుడు, సినీ ప్రియుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న రజనీకాంత్‌ నటుడిగా 5 దశాబ్దాల ప్రస్థానం పూర్తి చేయడం ఎంతో అరుదైన గౌరవం,” అని పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Kangana : ఆ సమయంలో వచ్చే బాధ.. ఎంపీలకూ తప్పదు.. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు

రజనీకాంత్‌ నటన విభిన్న కోణాలను ఆయన ప్రస్తావిస్తూ, పవన్ కల్యాణ్‌ అన్నారు: “ప్రతినాయక పాత్రలోనూ, కథానాయకుడిగా కూడా రజనీకాంత్‌ తనదైన శైలిని చూపించారు. ఆయన నడక, మాట తీరు, హావభావాలు – అన్నింటిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ స్టైల్‌కి పాతతరం మాత్రమే కాకుండా, నేటి నవతరం ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అభిమానులున్నారు. ఆయన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.”

అదేవిధంగా, నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ ఆధ్యాత్మికత పట్ల ఆయన చూపించే ఆసక్తి, మహావతార్ బాబాజీపై భక్తి, యోగా సాధనపై కేంద్రీకరించడం ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆంతరంగిక విశ్వాసాలను తెలియజేస్తుందని పవన్ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. “సినీ జీవితంలో స్వర్ణోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో రజనీకాంత్‌ మరిన్ని విభిన్నమైన, స్ఫూర్తిదాయకమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను,” అంటూ పవన్ కల్యాణ్‌ తన సందేశాన్ని ముగించారు.

Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!