Site icon HashtagU Telugu

Janasena Meeting: పవర్ షేరింగ్ ముచ్చట తరువాత.. ముందు జగన్ ని ఓడించాలి

Janasena Meeting

Logo (28)

Janasena Meeting: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ మనస్థితి బాగాలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనకు కేంద్రం నుంచి మానసిక నిపుణలతో వైద్యం చేయించాలని విమర్శించారు. జగన్ ఎలాంటివాడో ఆయన సన్నిహితులు తనతో చెప్పినట్టు పవన్ వెల్లడించారు. జగన్ వ్యవహరిస్తున్న తీరు అతని దైర్యంగా భావిస్తున్నారని, కానీ అది పిచ్చి మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. దైర్యంగా ఒక ప్రెస్ మీట్ పెట్టలేని సీఎం, కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రాలడని విమర్శించారు. జగనొక కౄరుడని, గడాఫీ, సద్దాం హుస్సేన్ లా జగన్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇక జనసేన టీడీపీ కూటమి అధికారం చేపడితే అధికారం ఎవరిదన్న దానిపై పవన్ మాట్లాడారు.2024 ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగే బలమైన స్థానాల గురించి నాకొదిలేయండంటూ ఆసక్తికరంగా స్పందించారు. పవర్ షేరింగ్ గురించి పక్కనపెడితే ముందు జగన్ ని ఓడించాలని, ఆ తర్వాత రాజెవరో, మంత్రి ఎవరో ఆలోచిద్దామని తెలిపారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి సమన్వయ కమిటీకి అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్ ని నియమించారు. 2009లో కన్న కలలను 2024లో గెలిచి సాకారం చేద్దామని పవన్ అన్నారు.

Also Read: Guava Benefits : జామపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?