Site icon HashtagU Telugu

Pawan Kalyan : పదేళ్లు రాజకీయంలో ఉన్నాను.. సీఎంగా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.. పవన్ హాట్ కామెంట్స్..

Pawan Kalyan comments on alliance for next governments and CM Post

Pawan Kalyan comments on alliance for next governments and CM Post

జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గత వారం రోజులుగా విశాఖ(Vizag) జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేనాని వారాహి యాత్రకు అభిమానులు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. మధ్యలో ప్రజావాణి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాజాగా నేడు విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోచుకున్నారు. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టం. వచ్చేది జనసేన ప్రభుత్వమా, జనసేన టీడీపీ కలిసిన ప్రభుత్వమా, లేక బీజేపీ జనసేన ప్రభుత్వమైనా.. ఏ ప్రభుత్వం వచ్చినా సహజ వనరులని దోచుకున్న వాళ్ళని వదిలిపెట్టను. నేను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాను. అందుకే సీఎంగా చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. దీంతో మరోసారి పవన్ రాబోయే ప్రభుత్వం గురించి, సీఎంగా చేయడానికి రెడీ అంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అలాగే.. వ్యక్తిగతంగా తిడతాను అంటే పడతాను. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ముందుకు వెళ్తాను అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆక్రమణలు, అవినీతి గురించి మాట్లాడుతూ ప్రతి పార్టీలోనూ లోటు పాట్లు ఉంటాయి. అందుకే ఈ సారి ఓట్లు చీలనివ్వను. వైసీపీ చేసిన పనులన్నీ బేరీజు వేసి చూస్తే వీళ్ళకంటే టీడీపీ పాలన మంచిది అనిపించింది అని అన్నారు. దీంతో మరోసారి జనసేన టీడీపీ పొత్తులు చర్చకు వస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారో చూడాలి.

 

 

Also Read : Gannavaram Political Heat : వంశీకి కౌండౌన్, టీడీపీలోకి యార్ల‌గ‌డ్డ‌?