Site icon HashtagU Telugu

Pawan Kalyan : జనసేన – టీడీపీ శ్రేణులకు పవన్ గుడ్ న్యూస్..

Pawan Kalyan

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..జనసేన శ్రేణులకు , టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ తెలిపారు. యువగళం ముగింపు సభకు హాజరవుతున్నట్లు సమాచారం అందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చి..తిరిగి ప్రారంభించారు. ఈరోజు విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర పూర్తి అవుతుంది. ఈ క్రమంలో యువగళం సక్సెస్ అయినా నేపథ్యంలో ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండంలలోని పోలిపల్లి వద్ద యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ముగింపు సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులతోపాటు, అతిరథ మహారథులు సైతం హాజరుకానున్నారు. కాగా ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు ఉండడంతో హాజరుకాలేకపోతున్నట్లు పవన్ సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం తో జనసేన , టీడీపీ శ్రేణులు కాస్త నిరాశకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ వస్తే ఎంతో బాగుండేదని మాటాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరువుతానని పవన్ తెలిపారట. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Read Also : Chandrababu offer to Pawan Kalyan : 25 అసెంబ్లీ సీట్లు , 2 పార్లమెంట్ సీట్లు..?