Site icon HashtagU Telugu

Pawan Kalyan : కాసేపట్లో మైసురావారిపల్లెలో పవన్ కళ్యాణ్ సందడి

Pawan Kalyan (7)

Pawan Kalyan (7)

నేటి నుండి ఏపీలో గ్రామ సభలు (Grama Sabhalu) మొదలుకాబోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మార్కు పరిపాలనతో దేశచరిత్రలో నిలిచిపోయేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు తీర్మానించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నారు. ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన వీటిని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలిస్తారు. తర్వాత రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు పెంచారు.

గ్రామసభల్లో చర్చించే నాలుగు అంశాలేంటంటే..

* మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు
* మురుగునీరు-ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులు
* గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లు
* ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం. ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం

Read Also : Viral : శవం పక్కన ఉండగానే శృంగారంలో మునిగిపోయిన జంట