Site icon HashtagU Telugu

AP Assembly : పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడు..ఈరోజు అన్నవారే లేకుండాపోయారు

Pawan Assem

Pawan Assem

‘జనసేన (Janasena) పార్టీ పెట్టి పదేళ్లు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్. ప్రజలు నిన్ను నమ్మలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు’ ఇలా వాగిన నోళ్లన్నీ మూతబడేలా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే చేసాడు. ఎవరైతే తనను..తన కుటుంబాన్ని ఎగతాళి చేసారో..వారెవర్నీ అసెంబ్లీ లో అడుగుపెట్టకుండా చేసాడు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. డిప్యూటీ సీఎం తో పాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ప్రమాణం చేసాడు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానం ఇచ్చారు. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టాడు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ అందుకున్న విజయం మాములు విజయం కాదు..ఓ అద్భుతమే. 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. తను మాత్రమే కాదు.. తన పార్టీ తరుఫున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పవన్‌ను ఏపీ ప్రజలు పూర్తిగా నమ్మారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును రైతులకు సాయంగా ఇచ్చి వారి మనసు గెలుచుకున్నాడు. 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడినా పవన్..2024 లో ఒకే ఒక చోట నిల్చుని విజయం సాధించడమే కాదు ఒక్క స్థానంలో కూడా తన అభ్యర్థులు ఓడిపోకుండా చూసుకున్నాడు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కొణెదల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ మధుర క్షణాలను చూసి మెగా ఫ్యామిలీ , జనసేన శ్రేణులు , అభిమానులు ఇలా యావత్ తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : CBN Is Back : గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడతా అన్నట్లే..అడుగుపెట్టాడు