Vamshi Krishna : విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్

వైసీపీ ఎమ్మెల్సీ అయినా వంశీ..డిసెంబర్ నెలలో జనసేన లో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు

  • Written By:
  • Publish Date - March 31, 2024 / 01:42 PM IST

జనసేన (Janasena) పార్టీ మరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించింది. విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ (Vamshi Krishna)పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్సీ అయినా వంశీ..డిసెంబర్ నెలలో జనసేన లో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భాంగా పవన్ కళ్యాణ్ వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వంశీకృష్ణ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అదే ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2011లో వైసీపీ లో చేరి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ వచ్చాడు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తరువాత పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా నియమితుడై పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2019లో టికెట్ దక్కలేదు. 2021లో మహా విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచాడు. ఆయనను విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 12 నవంబర్ 2021న వైసీపీ ప్రకటించింది. ఇక 2023 డిసెంబర్ 27న వైసీపీకి రాజీనామా చేసి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాడు.

ఇక ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే రేస్ లో బరిలోకి దిగబోతున్నాడు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉన్న పవన్.. నేడు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ బరిలోకి దిగబోతున్నట్లు అధికారిక ప్రకటనలో విడుదల చేశారు.

Read ALso : Easter Festival : ఇవాళే ఈస్టర్.. ఈ పండుగ ఆదివారమే ఎందుకొస్తుంది ?