Site icon HashtagU Telugu

Kakinada Janasena MP Candidate : కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

Janasena Kakinda Mp

Janasena Kakinda Mp

కాకినాడ (Kakinada ) ఎంపీ అభ్యర్థి (Janasena MP Candidate)ని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఏపీలో ఎన్నికల నగారా మోగడం తో జనసేన అధినేత పవన్ స్పీడ్ పెంచారు. తాను పోటీ చేసే నియోజకవర్గం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గెలుపు కోసం ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం పిఠాపురంలో పర్యటించాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈరోజు కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పొత్తులో భాగంగా జనసేన కు 2 ఎంపీ సీట్లు రాగా.. అందులో భాగంగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల (Uday Srinivas Tangella ) పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉదయ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ స్థానంలో పవన్ బరిలోకి దిగడంతో ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ ఎంపీ సీటు ఖరారు చేశారు. ఉదయ్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన విజయం కోసం కూటమి శ్రేణులు సహకారం అందించాలని పవన్ కోరారు. ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరు ప్రకటిస్తూ.. భవిష్యత్తులో తనకు ఎసరు పెట్టవు కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశాడని, భారీ మెజార్టీతో అతడ్ని గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

తనను పిఠాపురంలో పోటీ చేయాలని ఎక్కువ మంది కోరడంతోనే బరిలోకి దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘నన్ను అసెంబ్లీ పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధీమాతోనే చెబుతున్నా.. లక్ష మెజార్టీతో గెలుస్తా. ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి గెలిస్తే రాష్ట్రానికి మంచిది కానీ నాకు కాదు. అలాంటిది నన్ను ఓడించడానికి ఓటుకు రూ.10వేలు, కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.

ఇక వంగా గీత, సునీల్ మన ద్వారా రాజకీయాల్లోకి వచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన సునీల్.. తన డ్రెస్ బాగాలేదన్నారని పవన్ గుర్తు చేసారు. ఆయన ఓ మంచి వ్యక్తి కానీ.. సరిగ్గా లేని ఓ పార్టీలో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. వ్యవస్థపై కోపంతో ఎవరూ నోటాకు ఓటు వేయొద్దని .. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిస్తే దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.

Read Also : Sweet Rice With Coconut Milk: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు స్వీట్ రైస్.. ఇలా చేస్తే చేస్తే ప్లేట్ ఖాళీ?