Site icon HashtagU Telugu

AP : మహాసేన రాజేష్ కు బిగ్ షాక్..పి.గన్నవరం టికెట్ జనసైనికుడికే

Mahasena Rajesh

Mahasena Rajesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..శనివారం మరో రెండు సీట్లను ప్రకటించారు. పి.గన్నవరం (P . Gannavaram) అసెంబ్లీ స్థానం నుండి గిడ్డి సత్యనారాయణ (Giddi Satyanarayana
), పోలవరం స్థానాన్ని బాలరాజు (Balaraju) బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే పి.గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ (మహాజన Rajesh)ను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే స్థానం నుండి కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ ను ప్రకటించడంతో బరిలో మహాసేన రాజేష్ లేనట్లే అని తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా పి.గన్నవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మహాసేన రాజేష్ కు టీడీపీ టికెట్ కేటాయించగానే. రాజేష్ కు నియోజకవర్గంలో అంతగా పట్టలేదని, స్థానిక నేతలను పక్కన పెట్టి స్థానికేతరుడైన రాజేశ్‌కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం చేసారు. రాజేష్ నియోజకవర్గానికి చాలా తక్కువగా వచ్చాడని.. అసలు కార్యకర్తలతో కనీసం టచ్ లేదని.. స్థానిక టీడీపీ నేతలు రాజేష్ కు సహకరించడం కష్టమేనని తేలడం తో అధిష్టానం రాజేష్ ను తప్పించినట్లు తెలుస్తుంది. మరి రాజేష్ కూటమి కి సపోర్ట్ చేస్తారా..లేదా అనేది చూడాలి.

ఇక పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. పి.గన్నవరం జనసేన నేతలంతా వాటన్నింటినీ తట్టుకుని ఒకే మాట మీద నిలబడ్డారు. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలిసి సత్తా చాటారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర దిశ దశను నిర్దేశించేవి. పోటీ చేసే ప్రతీ స్థానం కీలకమే. పి.గన్నవరంలో జనసేన కచ్చితంగా గెలుస్తుంది’ అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

Read Also : PBKS vs DC: పంజాబ్ కింగ్స్ బోణీ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం