Pawan Kalyan Chamber : సచివాలయంలో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ఛాంబర్ సిద్ధం

పవన్ కళ్యాణ్‌ కోసం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో, 212వ గదిని అధికారులు సిద్ధం చేసారు

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 06:23 PM IST

ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు (Chandrababu) శాఖలు కేటాయించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటికే పలువురు మంత్రులు తమ బాధ్యతలు తీసుకొని..తమ పనిని మొదలుపెట్టగా..పవన్ కళ్యాణ్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారో అని ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులు తెరపడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన (బుధవారం) పదవి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ క్రమంలో సచివాలయంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక ఛాంబర్ ను సిద్ధం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్‌ కోసం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో, 212వ గదిని అధికారులు సిద్ధం చేసారు. పవన్‌తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ పేషీలో పని చేసే ఓఎస్డీలు, సెక్రటరీలు, ఇతర అధికారులకు అనుకూలంగా ఉండేలా ఛాంబర్ సిద్ధమవుతోంది. ఈనెల 12న పవన్‌ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అభిష్టం మేరకు శాఖలు కేటాయించారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు. పవన్ ఎంపిక చేసుకున్న శాఖలు పాలనా పరంగా కీలకమైనవి అలాగే పాలనలో ప్రాధాన్యత కలిగినవి. మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపడుతూనే వరుసగా తన శాఖల పైన సమక్షలు నిర్వహించనున్నారు. తొలి సారి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో..పవన్ పని తీరు..తీసుకొనే నిర్ణయాల పైన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఉన్నారు.

Read Also : Polavaram Project : పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైంది – చంద్రబాబు