Site icon HashtagU Telugu

Pawan Kalyan : మాట మార్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Salary Hash

Pawan Salary Hash

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట మార్చారు. అంటే ఏదో హామీ ఇచ్చి ఇప్పుడు చేయను అనడం లేదు..గతంలో చెప్పిన మాటను వెనక్కు తీసుకున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిందంటే..దానికి పవన్ కల్యాణే కారణం అని చెప్పాల్సిన పనిలేదు. అన్ని విషయాల్లో తగ్గి..ఈరోజు ప్రజలను గెలిపించారు. అందుకే సీఎం చంద్రబాబు..పవన్ కళ్యాణ్ కు అంత గౌరవం ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి తో పాటు పవన్ కళ్యాణ్ కోరిన కీలక శాఖలను సైతం అప్పగించారు. ప్రస్తుతం పవన్ సైతం ప్రజలు తన ఫై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చే పనిలో ఉన్నారు. ప్రతి నిమిషం ప్రజల గురించి ఆలోచిస్తూ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈరోజు కూడా అలాంటి కీలక నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. నేడు ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఉదయం ఆరు గంటలకే అధికారులు పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేయడం చేస్తున్నారు. సీఎం దగ్గరి నుండి ఎమ్మెల్యే ల వరకు ఈ పంపిణి లో పాల్గొన్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను తీసుకున్నవి శాఖలు కీలమైనవి కావడం తో తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం అనుకుంటున్నాను. పంచాయతీ శాఖలో ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో సెక్షన్ లో నాలుగేసి గంటలు కూర్చుంటే ఎన్నెన్ని కోట్లు పోయాయి తెలుస్తుంది. నా ఎకౌంట్స్ కి 20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక గంట సేపు కూడా కూర్చోలేదు. ప్రజల సొమ్ము కోసం ఎక్కడికి పోయాయో అని ఒక్కో సెక్షన్ లో నాలుగైదు గంటలు కూర్చున్నాను. ఒకప్పుడు నేను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నాను కానీ ఈ నిధులు చూస్తే తీసుకోకూడదని అనుకుంటున్నాను. నాకు జీతం అవసరం లేదు నా దేశం కోసం, నా నేల కోసం నేను పని చేస్తాను అని అన్నారు.

గతంలో జీతం తీసుకుంటా..నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని అడగాలి. మనం పనిచేయకపోతే మా ట్యాక్స్ మనీతో శాలరీలు ఇస్తున్నాం, ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలు అడగాలి. అందుకు నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. ప్రజల డబ్బు శాలరీగా తీసుకుంటున్నాను అనే భయంతో నేను పనిచేస్తాను అని తెలిపారు..కానీ ఇప్పుడు తీసుకోనని చెప్పడంతో తన శాఖల్లో తక్కువ నిధులు ఉన్నాయని జీతం తీసుకోకుండానే రాష్ట్రం కోసం పనిచేయడానికి పవన్ సిద్ధమయ్యారని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : 1st Accused : కొత్త క్రిమినల్ చట్టాలు.. తొలి కేసు ఎవరిపై నమోదైందో తెలుసా ?