ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద “అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు”(Akhanda Godavari Project)కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబడింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడింది.
Railway Track: రైలు పట్టాలపై కారు పరుగులు… 7 కిలోమీటర్ల హల్‌చల్‌తో రైళ్ల రాకపోకలకు బ్రేక్!
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పట్టువిడువని విక్రమార్కులు, నాకు ఇష్టమైన వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య గారు. మనం తగ్గాలి గానీ ఆయన మాత్రం తగ్గడు. ఆయన నుంచి ఓర్పు, పట్టుదల నేర్చుకోవాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన కోరినా, తానే పోటీ చేస్తానని బుచ్చయ్య తేల్చిన సందర్భాన్ని పరోక్షంగా పవన్ ప్రస్తావించడిగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
Vice-President Dhankhar: భారత ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
ఈ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాల్లో పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. 127 ఏళ్ల పాత హేవలాక్ వంతెనను పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దడం, పుష్కరాల రేవును అభివృద్ధి చేయడం, సైన్స్ సెంటర్, ఫారెస్ట్ అకాడమీ నిర్మాణం వంటి అంశాలు ఇందులో భాగం. ఈ ప్రాజెక్టు పూర్తైతే గోదావరి జిల్లాలకు పర్యాటక పరంగా కొత్త ఊపిరి లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.