Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది అంటూ వైసీపీ నేతలు సెటైర్లు

Sajjala Tdp List

Sajjala Tdp List

ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. మార్చి 14 , 15 తేదీలలో ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ రానున్న తరుణంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సుమారు 140 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ-జనసేన కూటమి ఈరోజు 99 స్థానాల్లో క్యాండిడేట్లను ఖరారు చేసి ఎన్నికలకు సమరశంఖం పూరించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా ఈరోజు టిడిపి కూటమి ప్రకటించిన లిస్ట్ ఫై వైసీపీ నేతలు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. జగన్ ఫై యుద్ధం చేస్తానని చెప్పుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ కేవలం 24 స్థానాలకే పరిమితం అయ్యాడని..ఇదేనా యుద్ధం అంటే అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేయడం స్టార్ట్ చేసారు. ‘పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు.. ఛీ’ అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ..అయితే పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలి వేస్తుందంటూ చెప్పుకొచ్చారు. పార్టీని నడిపే లక్షణాలు పవన్ కళ్యాణ్ ఏమాత్రం లేవని దుయ్యబట్టారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నాడని.. కనీసం ఏ స్థానంలో పోటీ చేయాలో కూడా ఆయనకు క్లారిటీ లేదని విమర్శించారు. పవన్ పోటీ చేసే 24 సీట్లలో కూడా బాబు అభ్యర్థులే ఉన్నారని తెలిపారు. జనసేన ఎప్పుడూ టీడీపీకి అనుబంధ పార్టీనేనని ఎద్దేవా చేశారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడెందుకు దిగజారిపోయారని ప్రశ్నించారు. పవన్ పోటీ చేసే స్థానాన్ని కూడా చంద్రబాబు నిర్ణయించాల్సి ఉందని ఎద్దేవా చేశారు. గతంలో జనసేనాని రెండు స్థానాల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. 175 స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరని.. రాష్ట్రానికి ఏం చేశారో? భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పలేదన్నారు. ఎన్ని పార్టీలతో పొత్తుపెట్టుకొని వచ్చిన జగన్ మోహన్ రెడ్డే నే మళ్లీ సీఎం అయ్యేదంటూ సజ్జల ధీమా వ్యక్తం చేసారు.

Read Also :