Site icon HashtagU Telugu

Pawan Kalyan : మరోసారి పవన్ కాకినాడ టూర్..3 రోజులే అక్కడే

Pawan Kalyan Telangana Camp

Pawan Kalyan Telangana Camp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి కాకినాడ (Kakinada) లో మకాం వేయబోతున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు పవన్ అక్కడే గడపబోతున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్..పూర్తిగా తన ఫోకస్ ను ఎన్నికల ఫై పెట్టారు. పార్టీ లోకి చేరికలు , అభ్యర్థుల ఎంపిక , ప్రచార కార్యక్రమాలు , ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఇలా అన్నింటిపై దృష్టి సారించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో కాకినాడ ఫై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రీసెంట్ గా మూడు , నాల్గు రోజులు కాకినాడ లోనే ఉండి పార్టీ కార్యచరణ కు సంబంధించి నేతలతో మాట్లాడిన పవన్..రేపు మరోసారి కాకినాడ కు వెళ్ళబోతున్నారు. ఈసారి కూడా మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అమలాపురం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో విడిగా విడిగా సమావేశం కానున్నారు. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ నుండి బరిలోకి దిగబోతారనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే పవన్ కాకినాడ ఫై మరింత ఫోకస్ పెట్టారని అంటున్నారు.

Read Also : AP : ఎవరు పార్టీని వీడిన నష్టమేలేదు – వైవీ సుబ్బారెడ్డి