Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదా..?

Pawan Jagan Siddam

Pawan Jagan Siddam

ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ ఏడు జాబితాలను రిలీజ్ చేయగా..ఈరోజు శనివారం టీడీపీ – జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మందితో కూడిన లిస్ట్ రిలీజ్ చేయగా..జనసేన 05 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఐదుగురిలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం జనసేన శ్రేణుల్లో నిరాశ కు గురి చేసింది. పవన్ కళ్యాణ్ పేరు మొదటి లిస్ట్ లోనే వస్తుందని అనుకున్నారు కానీ..లిస్ట్ లో పవన్ పేరు లేదు.

కేవలం తెనాలి: నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల: లోకం మాధవి, అనకాపల్లి: కొణతాల రామకృష్ణ, రాజానగరం: బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్: పంతం నానాజీ పేర్లను మాత్రం ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు చేసుకోలేదని తెలుస్తుంది. భీమవరం నుండి మరోసారి బరిలోకి పవన్ దిగబోతున్నడని గట్టిగా ప్రచారం జరగడం తో అంత అలాగే భవించారు. కానీ పవన్ పేరు లేకపోవడం భీమవరం నుండి పోటీ చేస్తాడా..? చేయడా..? అనేది మరోసారి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక టీడీపీ ప్రకటించిన 94 మంది పేర్లలో పలువురు సీనియర్లకు చోటివ్వలేదు. బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, బుద్దా వెంకన్న, పీతల సుజాత, గంటా శ్రీనివాస్ రావు, దేవినేని ఉమ, యరపతినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డికి జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. మరి రెండో జాబితాలోనైనా వీరి పేర్లు ప్రకటిస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

ఇక పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (రవీంద్రనాథ్ రెడ్డి)ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇదివరకు సతీశ్ రెడ్డి పోటీ చేయగా.. తొలిసారి ఈయన సీఎం జగన్ ఫై బరిలో నిలవనున్నారు. బీటెక్ రవి మాస్ లీడర్ గా పేరొందారు. వివేకా హత్య, YS కుటుంబంలో విభేదాలు తన గెలుపునకు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also : TDP – Janasena 1st List : టీడీపీ – జనసేన ఉమ్మడి లిస్ట్ వచ్చేసింది..